#Telangan Politics #Telangana

I am a junior in Congress.. How can I become CM: Ponguleti కాంగ్రెస్‌లో జూనియర్‌ని.. నేనెలా సీఎం అవుతా: పొంగులేటి

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీలో నేను చాలా జూనియర్‌ని.. తాను ఎలా ముఖ్యమంత్రిని అవుతానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్లు వార్తలు రాసుకుంటున్నారని అన్నారు. ఆయన గురువారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి అవుతానని నేను అనుకుంటే అది బుద్ధి తక్కువ అవుతుంది. తెలంగాణలో 11కు పైగా ఎంపీ సీట్లు ఈజీగా గెలుస్తాం. 3 సీట్లలో పోటాపోటీ ఉంటుంది. బీజేపీ 2 ఎంపీ సీట్లు గెలుస్తుంది. బీఆర్‌ఎస్‌ 1 లేదా రెండు ఎంపీ సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది.

రాష్ట్రంలో సాగునీటి కొరతకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణం. కాళేశ్వరం ప్రోజెక్టు 3 పిల్లర్లతో డ్యామేజ్ ఆగదు. మొత్తం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. కాళేశ్వరంలో నీటిని స్టోర్ చేయాలని బీఆర్‌ఎస్‌ మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తోంది. రాష్ట్రంలో త్రాగునీరు కొరత లేకుండా చూస్తున్నాం. నీటి కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. మేము ఇంకా గేట్లు ఎత్తలేదు. గేట్లు ఎత్తితే బీఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుంది. మా ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్‌ఎస్‌ రెచ్చగొడుతుంది’ అని మంత్రి పొంగులేటి అన్నారు. 

I am a junior in Congress.. How can I become CM: Ponguleti కాంగ్రెస్‌లో జూనియర్‌ని.. నేనెలా సీఎం అవుతా: పొంగులేటి

ANDHRA BJP : tickets.. Confusion in AP

I am a junior in Congress.. How can I become CM: Ponguleti కాంగ్రెస్‌లో జూనియర్‌ని.. నేనెలా సీఎం అవుతా: పొంగులేటి

Ponnam : Complained to CS about RDO

Leave a comment

Your email address will not be published. Required fields are marked *