Hyderabad DEO Bans Sale Of Uniforms, Stationery In Schools: తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. ఇకపై ప్రైవేట్ స్కూళ్లలో యూనీఫాం, బూట్లు, షూ అమ్మకాలు నిషేధం!

యూనిఫామ్లు, బూట్లు, బెల్టుల అమ్మకాల పేరిట తల్లిదండ్రులను దోచుకుంటున్న ప్రైవేట్ స్కూళ్ల అక్రమాలపై ప్రభుత్వం కొరడా విధించింది. స్టేషనరీ, పుస్తకాలు వంటి వాటిని లాభాపేక్ష లేకుండా అమ్ముకోవాలని తెలిపింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్ డీఈవో ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, మే 31: యూనిఫామ్లు, బూట్లు, బెల్టుల అమ్మకాల పేరిట తల్లిదండ్రులను దోచుకుంటున్న ప్రైవేట్ స్కూళ్ల అక్రమాలపై ప్రభుత్వం కొరడా విధించింది. స్టేషనరీ, పుస్తకాలు వంటి వాటిని లాభాపేక్ష లేకుండా అమ్ముకోవాలని తెలిపింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్ డీఈవో ఆదేశాలు జారీ చేశారు. తాజా ఆదేశాల మేరకు ప్రైవేట్ పాఠశాలల్లో యూనిఫాం, షూ, బుక్స్, స్టేషనరీ అమ్మకూడదు.

ఈ నిబంధన హైదరాబాద్ జిల్లాలో నడుస్తున్న రాష్ట్ర పాఠశాలలతోపాటు CBSE, ICSE పాఠశాలలకు కూడా వర్తిస్తుంది. ఈ పాఠశాలల ప్రాంగణాల్లో యూనిఫారాలు, షూ, బెల్ట్ మొదలైనవాటిని విక్రయించకూడదు. కోర్టు ఆదేశాల ప్రకారం.. పాఠశాల కౌంటర్లో పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే అవి వాణిజ్యేతరంగా, లాభాపేక్ష లేకుండా ఉండాలని తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలలను క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అన్ని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలో యూనిఫారాలు, షూ, బెల్ట్ మొదలైనవాటిని అమ్మకుండా చూసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.