Has Bhuvangiri ticket turned into a Revanth vs. Komatireddy war? భువనగిరి టికెట్ రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి వార్‌గా మారిందా.?

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ విషయంలో పీటముడి వీడడం లేదా..? తమ వారికి టికెట్ ఇప్పించుకునేందుకు హేమాహేమీలు రంగంలోకి దిగడంతో అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారిందా..? ఇక్కడ గెలుపు ఈజీగా ఉండడంతో కాంగ్రెస్‌లో భువనగిరి ఎంపీ టికెట్ హాట్ టాపిక్‌గా మారిందా.? భువనగిరి టికెట్‌పై కోమటిరెడ్డి కుటుంబం కన్నేసిందా.?
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ విషయంలో పీటముడి వీడడం లేదా..? తమ వారికి టికెట్ ఇప్పించుకునేందుకు హేమాహేమీలు రంగంలోకి దిగడంతో అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారిందా..? ఇక్కడ గెలుపు ఈజీగా ఉండడంతో కాంగ్రెస్‌లో భువనగిరి ఎంపీ టికెట్ హాట్ టాపిక్‌గా మారిందా.? భువనగిరి టికెట్‌పై కోమటిరెడ్డి కుటుంబం కన్నేసిందా.? సతీమణి లక్ష్మీ కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారా..? సన్నిహితుడు చామల కిరణ్ రెడ్డి కోసం సీఎం రేవంత్ పట్టుబడుతున్నారా..? భువనగిరి టికెట్.. రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి వార్‌గా మారిందా..? భువనగిరి ఎంపీ టికెట్ పాలిటిక్స్ పొలిటికల్ హీట్ పెంచిందా.?
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు ఎంపికపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. భువనగిరి టికెట్ కోసం బలమైన ఆశావాహులు పోటీ పడుతుండడంతో అభ్యర్థి ఎంపిక పార్టీకి సవాల్‌గా మారుతోంది. భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్లో 7 అసెంబ్లీ స్థానాలకుగానూ 6 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ టికెట్ దక్కించుకుంటే చాలు విజయం తేలికేనని ఆశావాహులు భావిస్తుండడంతో భువనగిరి చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థి ఎంపిక కొలిక్కి రాకపోవడంతో మలి జాబితాలో కూడా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ.. ఈ టికెట్‌ను ప్రకటించకుండా పక్కన పెట్టింది. ఈ ఎంపి టిక్కెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఎంపి టిక్కెట్ కోసం కాంగ్రెస్ లో బిగ్ ఫైట్..
భువనగిరి టికెట్‌ను కోమటిరెడ్డి కుటుంబ ఆశిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి, కోమటిరెడ్డి బ్రదర్స్ సోదరుడి కొడుకు సూర్య పవన్ రెడ్డి ఆశిస్తున్నారు. వీరితోపాటు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు చామల కిరణ్ రెడ్డి కూడా టికెట్ కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. అయితే రాష్ట్ర క్యాబినెట్ బెర్త్ కోసం రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పదవి వస్తుందన్న నమ్మకంతో ఉన్న రాజగోపాల్ రెడ్డి.. సతీమణికి భువనగిరి ఎంపీ టికెట్ అడిగితే.. అది మంత్రి పదవికి అడ్డంకిగా మారుతుందేమోనని భావించారట. మరోవైపు సూర్య పవన్ రెడ్డి కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నారట.