Former CM KCR to Shift to Another house..ఈ కారణంగానే ఇల్లు మారనున్న మాజీ సీఎం కేసీఆర్..

గత పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కెసిఆర్‌కు ఇప్పుడు ఉండడానికి ఇల్లు ఇబ్బందిగా మారింది. కింగ్ ప్యాలస్ లాంటి ప్రగతిభవన్లో నివాసమున్న ఆయన ఇప్పుడు నందినగర్ లోని పాత ఇంట్లో సర్దుకుంటున్నారు. 2014 ఉద్యమకాలంలో ఆ ఇంటి నుంచి ఎన్నికల్లో పోరాడి మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అది ఇరుకుగానే ఉంది. రోజు వచ్చి పోయే వాహనాలు, పార్టీ నేతలు, కార్యకర్తలతో బంజరాహిల్స్‌లోని ఆయననుండే నంది నగర్ కాలనీ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది.
గత పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కెసిఆర్‌కు ఇప్పుడు ఉండడానికి ఇల్లు ఇబ్బందిగా మారింది. కింగ్ ప్యాలస్ లాంటి ప్రగతిభవన్లో నివాసమున్న ఆయన ఇప్పుడు నందినగర్ లోని పాత ఇంట్లో సర్దుకుంటున్నారు. 2014 ఉద్యమకాలంలో ఆ ఇంటి నుంచి ఎన్నికల్లో పోరాడి మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అది ఇరుకుగానే ఉంది. రోజు వచ్చి పోయే వాహనాలు, పార్టీ నేతలు, కార్యకర్తలతో బంజరాహిల్స్‌లోని ఆయననుండే నంది నగర్ కాలనీ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పటికే కొంతమంది కాలనీవాసులు దీనిపై కేటీఆర్‌కు ఫిర్యాదు కూడా చేశారట. దీంతో ఆ ఇంటిని పెద్దది చేయడం లేదా వేరేచోట ఇంకో పెద్ద ఇల్లు నిర్మించుకోవడం లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కెసిఆర్ మాత్రం అచ్చొచ్చిన ఆ సెంటిమెంట్ ఇల్లును వదులుకోవడానికి ఇష్టపడలేదు.
దీంతో నందినగర్‌లో ఉన్న కేసీఆర్ ఇంటికి ఆనుకునే పక్కనే అమ్మకానికి ఉన్న ఓ ఇంటిని కొనేశారు. ఇప్పుడు ఆ రెండిళ్లను కలిపి ఒకే పెద్ద నివాసంగా నిర్మించాలని భావిస్తున్నారు. అయితే ఆ లోపు తత్కాలికంగా కేసీఆర్ ఒకటి రెండేళ్ల పాటు మరోచోట నివాసం ఉండాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రోటోకాల్ ప్రకారం క్యాబినెట్ హోదా ఉంటుంది. ఇందులో భాగంగా ఆయనకు ఒక క్వార్టర్స్‌ని కూడా కేటాయించవచ్చు. గతంలో ప్రగతిభవన్లో ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఆ ఎదురుగా ఉన్న కుందన్‌బాగ్ గవర్నమెంట్ క్వార్టర్ కి షిఫ్ట్ అవ్వాలని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం కుందన్‌బాగ్‌లో ఉన్న నాలుగు క్వార్టర్స్ ని ఆయన పరిశీలించారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు జానారెడ్డి నివాసమున్న ఒక క్వార్టర్‌ని, స్పీకర్స్‌కి కేటాయించి మరొక క్వార్టర్స్‌ని కూడా ఆయన పరిశీలించారు. వచ్చిపోయే కార్యకర్తలతో ఇబ్బందులు లేకుండా ఉండేలాగా , చిన్న చిన్న సమావేశాలు పెట్టుకునేందుకు వీలు ఉండేలా ఆయన ఇల్లు చూసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన కుందన్‌బాగ్‌లో ఉన్న క్వార్టర్స్‌కి షిఫ్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.