Dussehra : దసరా కానుకలు

రాష్ట్ర ప్రభుత్వం పండుగలకు ప్రాధాన్యం ఇస్తోంది.. ఆయా వర్గాల ప్రజలకు కానుకలు అందిస్తోంది.. దసరా సందర్భంగా ఏటా ఆడబిడ్డలకు చీరలు అందిస్తోంది. ఈ కానుకలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చేరుకున్నాయి. చీరలను చేనేత జౌలి శాఖ అధికారులు వాహనాల నుంచి అన్‌లోడ్ చేయించి డీఆర్‌డీవోలకు అప్పగించారు. జిల్లా కేంద్రాల్లో నిల్వ చేశారు. వీటిని అన్ని మండల కేంద్రాలకు పంపిస్తున్నారు. అక్కడ నుంచి గ్రామాలకు చేరుతాయి. ఈనెల 4 నుంచి పట్టణాలు, గ్రామాల్లో మహిళలకు పంపిణీ చేయనున్నారు. ఈనెల 14వ తేదీ వరకు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఉమ్మడి వరంగల్‌లోని అన్ని జిల్లాలకు 85 శాతం వరకు చీరలు వచ్చాయి. మిగిలినవి కొద్ది రోజుల్లో రానున్నాయి. వివిధ రకాల రంగుల్లో చీరలను తయారు చేశారు.