#Telangan Politics #Telangana

CM Revanth’s decision on Jayajayahe Telangana song : జయజయహే తెలంగాణ గీతంపై సీఎం రేవంత్‌ నిర్ణయం..

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రముఖకవి అందెశ్రీ రచించిన ’జయజయహే తెలంగా ణ’ ను యథాతథంగా ఉంచాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. 13 నిమిషాల నిడివి గల ఆ పాట సాహిత్యం, ప్రతి చరణం అలాగే కొనసాగించాలని స్పష్టం చేశారు. ’జయజయహే తెలంగాణ గేయానికి బాణీలు, సంగీతకూర్పుపై ఆదివారం ఓ స్టూడియోలో గేయ రచయిత అందెశ్రీ, సంగీత ద ర్శకుడు కీరవాణి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ముఖ్య ప్రజా సంబంధాల అధికారి బోరెడ్డి అయోధ్యరెడ్డిలతో రేవంత్‌ సమావేశమయ్యారు.

 ఈ భేటీలో అందెశ్రీ, కీరవాణిలకు ఆయ న పలు సూచనలు చేశారు. వాటికి అనుగుణంగా మార్పుల అనంతరం మరోమారు సమావేశమై గేయానికి తుది రూపం ఇవ్వాలని నిర్ణయించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై 13 నిమిషాలు గేయం ఆలపించడం అతిథులకు ఇబ్బంది కలిగిస్తుందేమో ననే అభిప్రాయంతో షార్ట్‌ వర్షన్‌ రూపొందించాలనే అభిప్రాయం చర్చకు వచి్చందని, ఈ షార్ట్‌ వర్షన్‌ బాధ్యత అందెశ్రీకి అప్పగించారని తెలుస్తోంది.

CM Revanth’s decision on Jayajayahe Telangana song : జయజయహే తెలంగాణ గీతంపై సీఎం రేవంత్‌ నిర్ణయం..

KTR:If more jobs are given than us,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *