#Telangan Politics #Telangana

CM Revanth Reddy made sensational comments : సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

సొంత ఇలాకాలో ధమాకా మోగించే వ్యూహం రచిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సడెన్‌గా కుట్రకుథా చిత్రమ్‌ అంటూ రగిలిపోయారు. కొడంగల్‌లో కుట్రలు చేస్తున్నారంటూ, గోతులు తవ్వుతున్నారంటూ ఆయన చేసిన హాట్‌కామెంట్స్‌ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి..

సొంత ఇలాకాలో ధమాకా మోగించే వ్యూహం రచిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సడెన్‌గా కుట్రకుథా చిత్రమ్‌ అంటూ రగిలిపోయారు. కొడంగల్‌లో కుట్రలు చేస్తున్నారంటూ, గోతులు తవ్వుతున్నారంటూ ఆయన చేసిన హాట్‌కామెంట్స్‌ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.. ఒక ముఖ్యమంత్రే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం తన సొంత నియోజవర్గం కొడంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా డీకే అరుణపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డీకే అరుణ పాలమూరుకు ద్రోహం చేశారన్న సీఎం సీఎం.. కొడంగల్‌లో తనను దొంగ దెబ్బ తీసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఓడితే కొడంగల్‌లో అభివృద్ది ఆగిపోతుందన్నారు.

కొడంగల్‌లో కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్రలపై సీఎం రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ద్రోహం చేసి డీకే అరుణ బీజేపీలో చేరారన్నారు. వంశీచంద్ రెడ్డిను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. కొంతమంది నేతలను డీకే అరుణ ప్రలోభాలకు గురి చేస్తున్నారని.. మతం పేరుతో కోస్గిలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. కొడంగల్‌ను అభివృద్ధి చేస్తున్నందుకు ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించారు

తనను దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీకే అరుణ పాలమూరుకు, కొడంగల్‌కు ఏమీ చేయలేదని చెప్పారు. కొడంగల్ ప్రాంతం ప్రతిష్టను పెంచాలని.. కొడంగల్ అభివృద్ధి ఇదే రకంగా ముందుకు సాగాలంటే వంశీచంద్‌ రెడ్డికి నియోజకవర్గంలో 50 వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికే కొడంగల్‌ నాయకత్వం వహిస్తోందని.. వంశీచంద్ రెడ్డి గెలిస్తే పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తాడని తెలిపారు.

CM Revanth Reddy made sensational comments : సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

Hyderabad: 1000 Rupees Fine For Selfie :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *