CM Revanth: Holi celebrations at CM’s house..సీఎం ఇంట హోలీ సంబురాలు.. మనువడితో సెలబ్రేట్ చేసుకున్న రేవంత్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు రంగుల జడిలో తడిసిపోతున్నారు. యువతీ యువకులు రెయిన్స్ డాన్సులు చేస్తూ ఆకట్టుకున్నారు. ఇక రాజకీయ నాయకులు కూడా రంగులతో తడిసిపోయారు. హోలీ వేడుకల్లో సీఎం రేవంత్ ప్రత్యేకంగా నిలిచారు.
తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు రంగుల జడిలో తడిసిపోతున్నారు. యువతీ యువకులు రెయిన్స్ డాన్సులు చేస్తూ ఆకట్టుకున్నారు. ఇక రాజకీయ నాయకులు కూడా రంగులతో తడిసిపోయారు
ఇక హోలీ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రజలందరికీ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, ఆప్యాయత, సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే రంగుల పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
సంప్రదాయ పద్ధతుల్లో సహజ రంగులను ఉపయోగించి హోలీ పండుగను జరుపుకోవాలని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వంలో ‘ప్రజా పాలన’లో సంక్షేమం, అభివృద్ధి ఫలాలు కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సెలబ్రేషన్స్ లో భాగంగా సీఎం రేవంత్ మనవడితో కలిసి సరదాగా జరుపుకున్నారు. సంబురాల్లో సీఎం సతీమణి కూడా ఉన్నారు. ప్రస్తుతం రేవంత్ హోలీ ఫొటోలు వైరల్ గా మారాయి.
ప్రతినిత్యం అధికారిక కార్యక్రమాలు, రివ్యూలు, మీటింగ్స్ తో బిజీగా ఉండే ముఖ్యమంత్రి హోలీ సంబురాలను ఇలా జరుపుకున్నారు.
3 / 5