BRS TELANGANA: KK met with KCR.. కేసీఆర్‌తో కేకే భేటీ.. బీఆర్‌ఎస్‌కు షాక్ ఇస్తారా?

సిద్దిపేట: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన కేకే పార్టీ మార్పు ప్రచారంపై కేసీఆర్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం.
ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరికకు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి రంగం సిద్ధం చేసుకుందనే ప్రచారం జరుగుతోంది. కేకేను కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను కేకే కలవడం చర్చనీయంగా మారింది.
కాగా, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్, బీజేపీకే అధిక సీట్లు వస్తాయంటూ కేకే సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కేకే.. బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉండబోతుందంటూ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.