#Telangan Politics #Telangana

BRS Party Harish Rao: Save Farmers Immediately అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి: హరీశ్ రావు

గత రెండు రోజులుగా తెలంగాణలో అకాల వర్షాలు కురిసాయి. దీంతో పలు జిల్లాల రైతుల చేతకొచ్చే పంటలను కోల్పోయారు. లక్షల్లో నష్టం వాటిల్లింది. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రైతులకు అకాల వర్షం తీవ్ర నష్టం చేకూర్చింది. ఈ సమస్యపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.

గత రెండు రోజులుగా తెలంగాణలో అకాల వర్షాలు కురిసాయి. దీంతో పలు జిల్లాల రైతుల చేతకొచ్చే పంటలను కోల్పోయారు. లక్షల్లో నష్టం వాటిల్లింది. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రైతులకు అకాల వర్షం తీవ్ర నష్టం చేకూర్చింది. ఈ సమస్యపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ‘‘ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింది. పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చింది’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘వరి, మొక్కజొన్న, జొన్న పంటలతోపాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే, అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించారు. అక్కడికక్కడే ఎకరాకు రూ. 10 నష్టపరిహారం ప్రకటించి అమలు చేశారు. రెండు, మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ, ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు’’ అని హరీశ్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వానుద్దేశించి ట్వీట్ చేశారు.

‘‘రాజకీయాలు తప్ప, రైతు ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్.. ఇప్పటికైనా మేల్కొని అన్నదాతకు అండగా నిలవాలి. జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయడంతో పాటు, ఎకరాకు రూ. 10 వేల నష్ట పరిహారం చెల్లించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని మాజీ మంత్రి మండిపడ్డారు. కాగా తెలంగాణలో కురిసిన అకాల వర్షాల వల్ల పలు జిల్లాల రైతులు భారీగా నష్టపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

BRS Party Harish Rao: Save Farmers Immediately  అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి: హరీశ్ రావు

Radhakrishnan will take charge as the new

Leave a comment

Your email address will not be published. Required fields are marked *