BRS : Cantonment Zone BRS Candiate Niveditha : కంటోన్మెంట్ బిఆర్‌ఎస్ అభ్యర్థి నివేదిత!

హైదరాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరు ఖరారైంది. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. బుధవారం పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయంలో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో లాస్య నందిత సోదరి నివేదితను బీఆర్‌ఎస్ బరిలోకి దింపింది. లోక్‌సభ ఎన్నికలతోపాటు మే 13న కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి