#ANDHRA ELECTIONS #Elections #Telangan Politics #Telangana

BJP MP List: Fifth list with 111 candidates : 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితా ప్రకటించిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాల్లో వీరికే ఛాన్స్

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఈసారి 400 సీట్లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ.. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఐదో జాబితా విడుదల చేసింది

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఈసారి 400 సీట్లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ.. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఐదో జాబితా విడుదల చేసింది. హర్యానాలోని కురుక్షేత్ర నుంచి నవీన్ జిందాల్, హిమాచల్‌లోని మండి నుంచి నటి కంగనా రనౌత్, సంభల్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బీజేపీ పోటీకి దింపింది. ఇక కర్ణాటకలోని బెల్గాం నుంచి జగదీశ్ షెట్టర్‌లతో సహా కొందరు నేతల పేర్లతో భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఐదవ జాబితాను ప్రకటించింది. మొత్తం 111 మందితో కూడిన జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు.

ఐదోవ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి లోక్‌‌సభ స్థానం నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరు ఖరారు అయ్యింది. అనకాపల్లి నుంచి సీఎం రమేశ్, అరకు స్థానం నుంచి కొత్తపల్లి గీత, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి – వరప్రసాద్, నరసాపురం లోక్‌సభ స్థానంలో శ్రీనివాస్ వర్మకు టికెట్లు కేటాయించారు. ఇక తెలంగాణలోని ఖమ్మం ఎంపీ స్థానాన్ని తాండ్ర వినోద్ రావు, వరంగల్ సీటును ఆరూరి రమేశ్ కు కేటాయించింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం.

ఐదో అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి 6, తెలంగాణలో 2, బీహార్ నుంచి 17, గోవా నుంచి 1, గుజరాత్ నుంచి 6, హర్యానా నుంచి 4, హిమాచల్ ప్రదేశ్ నుంచి 2, జార్ఖండ్ నుంచి 3, కర్ణాటక నుంచి 4, కేరళ నుంచి 4, 3 మంది అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. మహారాష్ట్ర నుంచి 3, మిజోరం నుంచి 3. ఒడిశాలో 1, రాజస్థాన్‌లో 7, సిక్కింలో 1, ఉత్తరప్రదేశ్‌లో 13, పశ్చిమ బెంగాల్‌లో 19 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

తెలంగాణ లోక్‌సభ అభ్యర్థులుః

వరంగల్‌ (ఎస్సీ): ఆరూరి రమేశ్‌

ఖమ్మం: తాండ్ర వినోద్‌రావు

ఏపీ లోక్‌సభ అభ్యర్థులుః

అరకు : కొత్తపల్లి గీత

అనకాపల్లి: సీఎం రమేష్

రాజమహేంద్రవరం : దగ్గుబాటి పురందేశ్వరి

నర్సాపురం : భూపతిరాజు శ్రీనివాస వర్మ

తిరుపతి (ఎస్సీ) : వరప్రసాదరావు

రాజంపేట : నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

ఇక హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ పోటీ చేయనున్నారు. మీరట్ నుంచి రామాయణం నటుడు అరుణ్ గోవిల్‌కు పార్టీ టికెట్ ఇచ్చింది. జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ తమ్లూక్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. సుల్తాన్‌పూర్‌ నుంచి బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి టికెట్‌ ఇచ్చారు. జనరల్ వీకే సింగ్‌ను ఘజియాబాద్ నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ ఆర్‌కేఎస్ భదౌరియా బరిలోకి దిగుతున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పూరీ నుంచి పోటీ చేయనున్నారు. ఇక వరుణ్‌గాంధీని పక్కనబెట్టిన బీజేపీ ఆయన స్థానంలో జితిన్‌ప్రసాద్‌ను రంగంలోకి దింపింది. కురుక్షేత్ర నుంచి పారిశ్రామికవేత్త, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ నవీన్‌ జిందాల్‌ బరిలోకి దిగారు.

పాట్నా సాహిబ్ అభ్యర్థిగా రవిశంకర్ ప్రసాద్ ఎంపికయ్యారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ బెగుసరాయ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ముజఫర్‌పూర్‌ నుంచి రాజ్‌భూషణ్‌ నిషాద్‌, పట్లీపుత్ర నుంచి రామ్‌ కృపాల్‌ యాదవ్‌లకు బీజేపీ టిక్కెట్‌ ఇచ్చింది. బక్సర్ నుంచి కేంద్ర సహాయ మంత్రి అశ్విని చౌబే టిక్కెట్‌ను నిరాకరించింది. బక్సర్ నుంచి మిథిలేష్ తివారీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ససారం నుంచి చెడ్డీ పాశ్వాన్‌కు కూడా టిక్కెట్ ఇవ్వలేదు. అతని స్థానంలో శివేష్ రామ్ అభ్యర్థిగా ఖరారు అయ్యారు. ముజఫర్‌పూర్‌ నుంచి అజయ్‌ నిషాద్‌ టికెట్‌ దక్కలేదు.

BJP MP List: Fifth list with 111 candidates : 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితా ప్రకటించిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాల్లో వీరికే ఛాన్స్

The son who peeled off his skin

BJP MP List: Fifth list with 111 candidates : 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితా ప్రకటించిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాల్లో వీరికే ఛాన్స్

ANDHRA CONGRESS PARTY : A sitting MLA

Leave a comment

Your email address will not be published. Required fields are marked *