#Telangan Politics #Telangana

Bandi vs Vinod in Karimnagar : కరీంనగర్‌లో కేంద్ర నిధుల పంచాయితీ.. లెక్కలేసి చెబుతున్న అభ్యర్థులు!

కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రాజకీయం‌ మరింత వేడేక్కింది. కేంద్రం ‌నుంచి వచ్చే నిధులు‌ తామే తెచ్చామంటూ ఈ ఇద్దరూ నేతలు అరోపణలు.. ప్రతి ఆరోపణలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. స్మార్ట్ సిటి నిధుల నుంచి మొదలుకుని అర్వోబీ‌ నిధుల వరకు మా‌.. చొరవే ఉందని‌ ప్రతి‌ సమావేశంలో ఈ ఇద్దరు నేతలు వాదిస్తున్నారు.

కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రాజకీయం‌ మరింత వేడేక్కింది. కేంద్రం ‌నుంచి వచ్చే నిధులు‌ తామే తెచ్చామంటూ ఈ ఇద్దరూ నేతలు అరోపణలు.. ప్రతి ఆరోపణలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. స్మార్ట్ సిటి నిధుల నుంచి మొదలుకుని అర్వోబీ‌ నిధుల వరకు మా‌.. చొరవే ఉందని‌ ప్రతి‌ సమావేశంలో ఈ ఇద్దరు నేతలు వాదిస్తున్నారు. అంతే కాదు ప్రక్క అధారాలు ఉన్నాయని‌ ప్రజలను అకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరూ సిట్టింగ్ ‌ఎంపీ అయితే, మరొక్కరు మాజీ ఎంపీ.

కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అ ఇద్దరు నేతలు దూకుడుగా‌ ఉన్నారు. ఒకరూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ‌బండి‌ సంజయ్ కుమార్ , మరొక్కరు బీఅర్ఎస్ ‌అభ్యర్థి‌ వినోద్ కుమార్. 2014 నుండి‌ 2019 వరకు కరీంనగర్ ఎంపీగా పని చేశారు వినోద్ కుమార్. 2019 నుండి‌ ఎంపీగా‌ కొనసాగుతున్నారు‌ బండిసంజయ్ కుమార్. అయితే ‌ఈ పదేళ్లలో‌ బీజేపీ ప్రభుత్వం ఉండడంతో నిధుల మంజూరు‌ క్రెడిట్ కోసం ఇద్దరు నేతలు ముమ్ముర ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ స్మార్ట్‌సిటి నిధుల కోసం చేయని ప్రయత్నం లేదంటూ వినోద్ కుమార్ చెబుతున్నారు. అప్పుడు ‌కరీంనగర్‌కు స్మార్ట్ ‌సిటి‌ అవకాశం లేనప్పటికి అప్పటి ‌కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును ఒప్పించి స్మార్ట్ సిటికి‌ అనుమతులు‌ తీసుకు వచ్చానని చెబుతున్నారు.

అయితే, వెంకయ్య నాయుడు వద్దకి‌ వెళ్ళి స్మార్ట్ సిటి ఇవ్వాలంటూ తాము విన్నవించడంతో‌ అంగీకరించారని‌ బండి సంజయ్ ‌అంటున్నారు. రెండు మూడు సార్లు వెంకయ్యనాయుడును కలిసి స్మార్ట్ ‌సిటి‌ అంశాన్ని వివరించామని గుర్తు చేశారు. స్మార్ట్ సిటి‌ రావడంలో ఇద్దరు నేతలు తమ వల్లనే వచ్చిందంటూ ఎక్కడికి‌ వెళ్ళిన వివరిస్తున్నారు. స్మార్ట్ సిటినే కాకుండా జాతీయ రహదారులు, అర్వోబీ నిధుల‌ విషయంలో తమ చొరవ వల్ల వచ్చిందంటూ‌ ప్రతి‌ సమావేశంలో హైలెట్ చేసుకుంటున్నారు.

అంతేకాకుండా తీగలగుట్టలపల్లిలో అర్వోబీ పనుల శంకుస్థాపనలో ఒకసారి బీఅర్ఎస్, మరొకసారి బీజేపీ‌ వెర్వేరుగా శంకుస్థాపనలు చేసుకున్నాయి. ఈ రెండు‌పార్టీల కార్యకర్తలు నేతలు పోటాపోటిగా నినాదాలు చేసుకున్నారు. ఆ సమయంలో ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. ఇక వరంగల్ – జగిత్యాల జాతీయ‌ రహదారి ప్రతిపాదనలను 2014లోనే‌ ఇచ్చానని వినోద్ కుమార్ ‌చెబుతున్నారు. తాను‌ ఎంపీ అయినప్పటి నుండే నిధుల మంజూరు వేగవంతంగా పనులు సాగుతున్నాయని సంజయ్ వివరిస్తున్నారు.

కేంద్రం ‌నుండి‌ వచ్చే నిధులు‌ ఇతర అంశాలని ప్రజాహిత యాత్రలో బండి సంజయ్ గ్రామా గ్రామాన‌ వివరిస్తున్నారు. ఈ ఐదేండ్లలలో‌ చేసిన అభివృద్ధి పనులని ప్రజలకి చెబుతున్నారు. అయితే ఎంపీగా ఎవ్వరూ‌ ఉన్న గ్రామీణ ఉపాది‌ హామీ‌ నిధులు, అంగన్వాడి నిదులు‌ మంజూరు ‌కావడం‌ కామాన్ అని వినోద్ ‌కుమార్‌ వాదన. మొత్తానికి ఈ ఇద్దరూ నేతలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన‌ నిదులపైనే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రజల వద్దకి వెళుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *