Amit Shah: తెలంగాణలో భాజపాకు 12 కంటే ఎక్కువ స్థానాలు: అమిత్‌షా

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ భాజపా (BJP)దే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit shah) అన్నారు
హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ భాజపా (BJP)దే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit shah) అన్నారు. మూడోసారి నరేంద్రమోదీని ప్రధానిగా చూడాలనే భావనలో ప్రజలు ఉన్నారని చెప్పారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో నిర్వహించిన భాజపా సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 12 కంటే ఎక్కువ సీట్లు దక్కించుకుంటామని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటికీ భాజపాను తీసుకెళ్లాలని సూచించారు.
‘‘అవినీతి రహిత భారత్ నిర్మాణమే భాజపా లక్ష్యం. కాంగ్రెస్, భారాస, మజ్లిస్ మూడూ అవినీతి పార్టీలే. మజ్లిస్ అజెండాతోనే కాంగ్రెస్, భారాస పనిచేస్తాయి. యురి ఘటన జరిగిన 10 రోజుల తర్వాత ఏం జరిగింది? పాక్‌పై సర్జికల్ స్ట్రైక్ చేసి ముష్కరులను మట్టుపెట్టాం. సైనికులపై దాడిని మర్చిపోయేందుకు ఇది మన్మోహన్ ప్రభుత్వం కాదు’’అని అమిత్ షా తెలిపారు.