Shanampudi Saidireddy – శానంపూడి సైదిరెడ్డి

సైదిరెడ్డి 1974, ఏప్రిల్ 18న అంకిరెడ్డి, సత్యవతి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో జన్మించాడు. సైదిరెడ్డి మఠంపల్లి లోని వీవీఎం హైస్కూల్‌లో 10వ తరగతి వరకు చదివాడు. ఇంటర్ హుజూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ ప్రియదర్శిని కళాశాలలో పూర్తిచేశాడు. సైదిరెడ్డి తండ్రి అంకిరెడ్డి గతంలో గుండ్లపల్లి సర్పంచ్ గా పనిచేశాడు. సైదిరెడ్డి తెలుగుదేశం పార్టీలో మఠంపల్లి మండలం ప్రధాన నాయకుడిగా ఉన్నాడు. సైదిరెడ్డి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగంలో చేరాడు. 2009లో తెలంగాణ ఉద్యమానికి ప్రభావితమయిన కెనడాలో తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ ఏర్పాటు చేసి ఉద్యమానికి మద్దతు అందించాడు.
విదేశాల్లో ఉద్యోగం, వ్యాపారంలో స్థిరపడిన సైదిరెడ్డి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక స్వరాష్ట్రానికి తిరిగివచ్చి అంకిరెడ్డి ఫౌండేషన్ ఏర్పాటుచేసి వివిధ సేవ కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తున్నాడు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్) చేతిలో 7,466 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2019లో హుజూర్‌నగర్ కు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డిపై 43,284 వేల మెజార్టీతో గెలుపొంది తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.