Madhavaneni Raghunandan Rao – Dubbaka MLA

సోలిపేట రామలింగారెడ్డి (అక్టోబరు 2, 1961 – ఆగస్టు 6, 2020) తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, పాత్రికేయుడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున 2004, 2008 (ఉపఎన్నిక)లలో దొమ్మాట శాసనసభ నియోజకవర్గం నుండి 2014, 2018 ఎన్నికల్లో దుబ్బాక శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంందాడు.
సుమారు 25 ఏళ్ళు పాత్రికేయుడిగా పనిచేసిన రామలింగారెడ్డి కేసీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చాడు. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో దొమ్మాట శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి ఎన్నికై తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టాడు. 2008 ఉపఎన్నికల్లో కూడా ఎన్నికయిన రామలింగారెడ్డి, 2009 ఎన్నికల్లో ఓడిపోయాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో దుబ్బాక శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డిపై 37,925 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 2018లో జరిగిన ముందస్తు తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వరరెడ్డిపై 62,500 ఓట్ల తేడాతో గెలుపొందాడు. శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు.