Akbaruddin Owaisi – Chandrayangutta MLA – అక్బరుద్దీన్ ఒవైసీ

అక్బరుద్దీన్ ఒవైసీ (జననం 1970 జూన్ 14) హైదరాబాదు-చాంద్రాయణగుట్టకు చెందిన శాసన సభ్యుడు. ఇతను ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీకి చెందిన వాడు. ఆంధ్రప్రదేశ్ విధాన సభలో ఆ పార్టీ ఫ్లోర్ లీడరు.[1] అక్బరుద్దీన్ ఒవైసీ కుటుంబానికి చెందిన వాడు. ఇతని తండ్రి సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ, అన్న అసదుద్దీన్ ఒవైసీ.
ఒవైసీ వివాస్పాద ప్రసంగాలకు ప్రసిద్ధి. 2007 లో సల్మాన్ రుష్దీ, తస్లీమా నస్రీన్ లకు వ్యతిరేక ఫత్వాను పురస్కరించుకుని వారు హైదరాబాదుకు వస్తే తగిన గుణపాఠం నేర్పుతామని ప్రకటించాడు.
1999, 2004, 2009, 2014 సం.లలో వరుసగా నాలుగు సార్లు హైదరాబాదు చాంద్రాయణ గుట్ట నుండి శాసన సభకు పోటీ చేసి గెలిచాడు.2018లో ఎన్నికల్లో గెలిచిన ఆయన 22 సెప్టెంబర్ 2019లో తెలంగాణ శాసనసభలో ప్రజా పద్దులు (పీఏసీ) కమిటీ చైర్మన్ గా ఎన్నికయ్యాడు.