Pidamarthi Ravi – పిడమర్తి రవి

పిడమర్తి రవి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) తొలి చైర్మన్‌గా పని చేశాడు. పిడమర్తి రవి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో క్రీయాశీలకంగా పాల్గొన్నాడు. ఆయన టీఎస్‌జేఏసీ రాష్ట్ర ఛైర్మన్‌గా పని చేశాడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుండి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. సత్తుపల్లి లో ఓటమి అనంతరం ఆయనను 4 డిసెంబర్ 2014న తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) తొలి చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసిన సండ్ర వెంకటవీరయ్య చేతిలో 19002 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.
పిడమర్తి రవి 2023 జులై 1న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఖమ్మంలో తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో జులై 2న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.