Good news for TS RTC employees.. – టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..

తెలంగాణ ఆర్టీసీ(TS RTC) కార్మికులకు శుభవార్త. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు గవర్నర్ (Governor)ఆమోద ముద్ర వేశారు. అయితే మొదట టీఎస్‌ఆర్టీసీ విలీన బిల్లు 2023ను మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం నెల రోజుల క్రితమే పంపింది. విలీన బిల్లులోని అంశాలను పరిశీలన కోసం పెండింగ్‌లో పెట్టిన గవర్నర్ తమిళిసై సౌందరాజన్ ఈరోజు ఆమోదం తెలిపారు. న్యాయశాఖ పరిశీలన తర్వాత బిల్లులోని అంశాలపై ప్రభుత్వం గవర్నర్‌కు వివరణ ఇచ్చింది. దీనిపై సానుకూలంగా స్పందించిన తమిళిసై విలీన బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగులున్న ఉన్న వారంతా ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. గవర్నర్ టీఎస్ ఆర్టీసీ విలీన బిల్లు 2023ను ఆమోదించడం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటి వరకు రోడ్డు రవాణా సంస్థలో కార్మికులు, ఉద్యోగులుగా పని చేస్తున్న 43,373 మంది ఆర్టీసీ ఎంప్లాయిస్ ఇప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందారు. గత నెలలో ప్రభుత్వ గవర్నర్ ఆమోదం కోసం పంపిన బిల్లును గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆమోదం తెలిపారు. ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాలకు ముందు టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. టీఎస్ ఆర్టీసీ విలీన బిల్లు 2023ను క్యాబినెట్ ఆమోదించి..అసెంబ్లీలో పాస్ చేయించింది. గవర్నర్ ఆమోదం కోసం నెల రోజుల క్రితం రాజ్‌భవన్‌కు పంపడం జరిగింది.
ఈ బిల్లులో కొన్ని అంశాలపై గవర్నర్ ప్రభుత్వాన్ని వివరణ కోరారు. అలాగే 10సిఫార్సులు చేశారు. వీటిపై ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్ తమిళిసై బిల్లును ఆమోదించారు. గవర్నర్ ఆమోద ముద్రవేయడంతో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ ఉద్యోగులంతా తమిళిసైకి కృతజ్ఞతలు తెలియజేశారు.