వ్యూహం మార్చిన వైఎస్సార్‌సీపీ.. మచిలీపట్నం(బందరు) అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్
కృష్ణా: మచిలీపట్నం(బందరు) లోక్‌సభ అభ్యర్థి విషయంలో వైఎస్సార్‌సీపీ వ్యూహం మార్చింది. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌పేరును తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయమై మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని సీఎం జగన్ ఆయన్ని( సింహాద్రి చంద్రశేఖర్) కోరారు. అందుకు ఆయన అంగీకరించారు. అందుకే సింహాద్రి చంద్రశేఖర్ పేరును ప్రకటిస్తున్నాం. చంద్రశేఖర్ ఈ ప్రాంతానికి బాగా సుపరిచితులు. ఆయన తండ్రి కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా.. మంత్రిగా కూడా పని చేశారు. ఇప్పుడు చంద్రశేఖర్ మచిలీపట్నం […]