Andhra Politics YS Sharmila: ఒక వైపు వైఎస్‌ఆర్ బిడ్డ.. మరో వైపు వివేకాను హత్య చేసిన నిందితుడు
కడప: వైఎస్‌ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం యాదవపురంలో చిన్న సుబ్బరాయుడు కుటుంబాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఓదార్చారు. సుబ్బరాయుడు కుమారుడు శ్రీనివాస్ యాదవ్ ఇటీవల హత్యకు గురయ్యారు. కేసులో ఎస్‌ఐ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయని, నిందితులంతా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులేనని షర్మిల ఆరోపించారు. భూమి కోసం అవినాష్ అనుచరులే హత్య చేశారని విమర్శించారు. పోలీసులు.. నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది హత్యలు చేయించడానికా? అని ప్రశ్నించారు. ఇక్కడే అన్యాయం జరుగుతుంటే […]