Former minister Yerneni Sita Devi passed away due to heart attack :గుండెపోటుతో మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత
హైదరాబాద్: మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. సోమవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్లో ఆమె తుదిశ్వాస విడిచారు. సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. సీతాదేవి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. యెర్నేని సీతాదేవి కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉన్నదే. ఆమె భర్త నాగేంద్రనాథ్(చిట్టిబాబు) […]