Yemen : అమెరికా డ్రోన్‌ను కూల్చేసిన హౌతీ తిరుగుబాటు దళాలు
అమెరికా(USA)కు చెందిన ఎంక్యూ-9 రిమోట్లీ పైలెటెడ్ డ్రోన్‌ను యెమెన్ (Yemen) లోని హౌతీ (Houthi) తిరుగుబాటు దళాలు కూల్చేశాయి. తమ భూభాగంపై నిఘా పెట్టి.. గూఢచర్యానికి పాల్పడుతున్న అమెరికా డ్రోన్‌ను యెమెన్ తీరప్రాంతంలో తమ బలగాలు కూల్చేసినట్లు హౌతీ వెల్లడించింది. అమెరికా రక్షణశాఖ అధికారులు సైతం ఈ దాడిని నిర్థారించారు. ఇజ్రాయెల్‌కు మిలటరీ సాయంలో భాగంగానే తమపై అమెరికా డ్రోన్లతో నిఘా పెట్టిందని ఈ గ్రూప్ ఆరోపిస్తోంది. ఇరాన్ మద్దతున్న హౌతీలు ఇజ్రాయెల్‌పై పలుమార్లు దాడులకు పాల్పడ్డారు. […]