Bhuvanagiri – భారాసలో చేరిన కాంగ్రెస్ నేత
భువనగిరి:గురువారం గొల్లపెల్లి గోడ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ భారసాలో చేరారు. వేడుకలకు ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి శాలువా కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. పార్టీలో చేరిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు ముందుకు వస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.