Empowerment with reservation – స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో సాధికారత.

మహిళలకు రిజర్వేషన్లు భారీ మేలే చేస్తున్నాయి. 3 దశాబ్దాల కిందట తెచ్చిన పంచాయతీరాజ్‌ సంస్థల్లో రిజర్వేషన్లు వారిని సాధికారత దిశగా నడిపించాయి. ఇప్పుడు చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లు వారికి మరింత ఊతమివ్వనుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రిసామా గ్రామ పంచాయతీ సర్పంచి గీతా మహానంద్‌నే తీసుకోండి. గృహిణిగా జీవితం వెళ్లదీసే ఆమె పంచాయతీరాజ్‌ రిజర్వేషన్ల పుణ్యమా అని సర్పంచి అయ్యారు. ఆ రిజర్వేషన్లు లేకుంటే తాను ఇంటికి పరిమితమయ్యేదానినని ఆమె అంటున్నారు. రిజర్వేషన్లు తనను […]

The Women’s Reservation Bill has received massive support in the Rajya Sabha – మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభలో భారీ మద్దతు లభించింది

పార్టీలకు అతీతంగా సభ్యులంతా స్పందించారు. సుమారు 11 గంటలపాటు చర్చ జరిగిన తర్వాత గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 214 మంది సభ్యులు ఓటేశారు. వ్యతిరేకంగా ఎవరూ ఓటేయలేదు. సభ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు పలికినా రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఓటింగ్‌ నిర్వహించారు. బిల్లు 2/3 వంతు సభ్యుల మద్దతుతో ఆమోదం పొందినట్లు ఓటింగ్‌ అనంతరం సభాపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ప్రకటించారు. ఆ తర్వాత సభను ఒక రోజు ముందుగానే నిరవధికంగా […]

‘That credit is ours’ said Sonia Gandhi – ‘ఆ క్రెడిట్ మాదే’ అన్నారు సోనియా గాంధీ

కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పార్లమెంటు భవనం వద్దకు వస్తూనే మహిళా రిజర్వేషన్ బిల్లుపై విలేఖరులు ఆమె స్పందన కోరగా ఈ బిల్లు మాదేనని అన్నారు. 2010లో కాంగ్రెస్ అదిఆకారంలో ఉన్నపుడు ఈ బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టగా  రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని బిల్లులోని అంశాలను పరిశీలించాల్సి ఉందని అన్నారు. ఒకవేళ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం […]