KTR bills – నా సీటు కోల్పోవాల్సి వచ్చినా సిద్ధమే..!
హైదరాబాద్: ‘భారత పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ బిల్లును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈ బిల్లు అమలులోకి వస్తే మరింతమంది మహిళానేతలు ప్రజాజీవితంలోకి వస్తారు. నేను నా సీటు కోల్పోవాల్సి వచ్చినా దానికి సిద్ధంగా ఉన్నా. మనందరివి చాలా చిన్నజీవితాలు, అందులో నా పాత్ర నేను పోషించాననే అనుకుంటున్నాను’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ.రామారావు అన్నారు. ‘క్యాపిటా లాండ్ ఇన్వెస్ట్‌మెంట్’(సీఎల్‌ఐ) కొత్తగా పునర్నిర్మించిన ‘ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్’(ఐటీపీహెచ్)ను కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. […]