West Bengal – సీనియర్ మంత్రి నివాసంపై సీబీఐ దాడులు

 పశ్చిమబెంగాల్‌ మంత్రి ఫిర్హద్‌ హకీం, అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మదన్‌ మిత్రల గృహాల్లో ఆదివారం సీబీఐ సోదాలు నిర్వహించింది. పౌర సంస్థల్లో చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో చోటు చేసుకున్న అవకతవకల ఆరోపణలపై ఈ దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక వ్యవహారాల మంత్రిగా, కోల్‌కతా మేయర్‌గా హకీం వ్యవహరిస్తున్నారు. పార్టీలో ప్రముఖనేతగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ సోదాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉదయం తొమ్మిది గంటలకు హకీం ఇంట్లోకి ప్రవేశించిన సీబీఐ […]

Good news to the Bengali people – బెంగాలీ ప్రజలకు శుభవార్త

బంగ్లాదేశ్‌ ప్రభుత్వం బెంగాలీ ప్రజలకు శుభవార్త చెప్పింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పద్మాపులస(హిల్సా)ను భారత్‌కు ఎగుమతి చేస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇళ్లలో హిల్సాను వండుకొని తింటారు. ఈ నేపథ్యంలో దాదాపు 4వేల మెట్రిక్‌ టన్నుల పద్మాపులసలను భారత్‌లో విక్రయించడానికి బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. బెంగాల్‌లో గురువారం నుంచి పద్మాపులస రాక ప్రారంభమైంది. సాధారణంగా కోల్‌కతా మార్కెట్లలో కిలో హిల్సా ధర […]