Cyclone: Cyclone destruction in Bengal.. బెంగాల్‌లో తుఫాన్ విధ్వంసం.. పలు ఇళ్లు ధ్వంసం, నేలకూలిన చెట్లు.. 5 మంది మృతి

తుఫాను కారణంగా సంభవించిన మరణాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. మృతులకు నష్టపరిహారం ప్రకటించారు. అంతేకాకుండా బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. తుపాను ధాటికి చాలా ఇళ్లు కూలిపోయాయి. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురిలో తుఫాన్ పెను విధ్వంసం సృష్టించింది. ఈ ప్రాంతంలో తుఫాను, వర్షం,  వడగళ్ల వాన కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. భారీ సంఖ్యలో చెట్లు నేలకూలాయి. చాలా ఇళ్లు […]