Bomb Blast In Cyria : సిరియాలో బాంబు పేలి.. ఏడుగురు చిన్నారులు మృతి

డెమాస్కస్‌: సిరియాలో కల్లోలిత దరా ప్రావిన్స్‌లో రోడ్డు పక్కన అమర్చిన బాంబు పేలిన ఘటనలో ఏడుగురు చిన్నారులు చనిపోగా మరో ఇద్దరు గాయపడ్డారు. బాంబు పేలుడుకు బాధ్యులెవరో తెలియా ల్సి ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దరా ప్రావిన్స్‌లో జరిగిన వివిధ ఘటనల్లో 100 మందికి పైగా చనిపో యారు. ఇజ్రాయెల్‌ ఆక్రమిత గొలాన్‌ హైట్స్, జోర్డాన్‌కు మధ్యలో దరా ప్రావిన్స్‌ ప్రాంతముంది. సిరియాలో 2011లో అంతర్యుద్ధానికి బీజం పడిందిక్కడే. 

Russia-Ukraine war:  రష్యా క్షిపణి దాడుల్లో 8 మంది మృతి

కీవ్‌: ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్‌పైకి రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. శుక్రవారం రాత్రి నుంచి జరిపిన దాడుల్లో 8 మంది చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు.  రష్యా 32 ఇరాన్‌ తయారీ షహీద్‌ డ్రోన్లను, ఆరు క్షిపణులను ప్రయోగించగా 28 డ్రోన్లను, 3 క్రూయిజ్‌ మిస్సైళ్లను కూలి్చవేశామని ఉక్రెయిన్‌ ఆర్మీ తెలిపింది. తాజా దాడులపై రష్యా మిలటరీ ఎటువంటి ప్రకటనా చేయలేదు.

America Warning To Israel : ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన అమెరికా.. 

యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో మానవతా సాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ శుక్రవారం తెలిపింది జెరూసలెం: యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో మానవతా సాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్‌ శుక్రవారం తెలిపింది. అందులో భాగంగా ఉత్తర గాజాలో కీలకమైన ఎరెజ్‌ సరిహద్దును తిరిగి తెరుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చలు జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం వెలువడటం […]

Israel:  America warned.. Israel came down!Israel:  హెచ్చరించిన అమెరికా.. దిగొచ్చిన ఇజ్రాయెల్‌!

Israel: గాజాలోకి మరింత మానవతా సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఇజ్రాయెల్‌కు అమెరికా తేల్చి చెప్పింది. లేదంటే భవిష్యత్తులో తమ సాయం నిలిపివేస్తామని హెచ్చరించింది. జెరూసలెం: యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో మానవతా సాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. అందులో భాగంగా ఉత్తర గాజాలో కీలకమైన సరిహద్దును తిరిగి తెరుస్తున్నట్లు వెల్లడించింది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఈ మేరకు ప్రణాళికలను వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చలు జరిగిన కొద్ది గంటల […]

Israel: Ours is a Big mistake.. Accepted Israel.. మాది ఘోర తప్పిదం.. అంగీకరించిన ఇజ్రాయెల్‌.. 

Israel: ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో గాజా పౌరులకు మానవతా సాయం అందిస్తున్న సిబ్బంది మరణించారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అగ్రరాజ్యం, బ్రిటన్‌.. వివరణ కోరాయి. గాజా: హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న యుద్ధంపై ఇప్పటికే అమెరికా సహా పలు దేశాలు పెదవి విరుస్తున్నాయి. వీలైనంత త్వరగా దీనికి ముగింపు పలకాలని పిలుపునిస్తున్నాయి. గాజాలో మానవతా సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సరిగ్గా ఈ తరుణంలో ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో.. మానవతా […]

Israel misses the target?… ఇజ్రాయెల్‌ టార్గెట్‌ మిస్‌?.. ఇరాన్‌ ఎంబసీపైకి మిస్సైళ్లు! 11 మంది మృతి

గాజా సంక్షోభ నేపథ్యంలో.. ప్రత్యర్థి దేశాలపై ఇజ్రాయెల్‌ తన దాడుల ఉధృతిని పెంచింది. తాజాగా సోమవారం సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ దౌత్య కార్యాలయంపై దాడి జరిపింది. ఈ దాడిలో మొత్తం 11 మంది మృతి చెందారు. అయితే ఈ దాడి ఎంబసీ లక్ష్యంగా జరిగి ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పుడు. గాజా యుద్ధంలో  ఇరాన్‌ మిత్రదేశాల్ని ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగపడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలోనే.. తాజా దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇరాన్‌ […]

Warangal Politics: BRS Harish Rao Angry on Kadiyam : 2024 కడియం పై విరుచుపడ్డ హరీష్ రావు..

మాజీ మంత్రి కడియం శ్రీహరి జంపింగ్ కారు పార్టీకి ఫుల్ బూస్టింగ్‌లా మారింది. ఎన్నికల వేల ఆ పార్టీకి ప్రచారాస్త్రంగా దొరికింది. ప్రచారంలో స్పీడు పెంచిన గులాబీ నేతలు కడియం భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్‌ను తూర్పాల పడుతున్నారు. కడియం శ్రీహరి నిత్యం మాట్లాడే విలువలు నీకు ఉంటే బీఆర్ఎస్ జెండా పై గెలిచిన ఎమెల్యే పదవికి రాజీనామా చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి జంపింగ్ కారు పార్టీకి ఫుల్ బూస్టింగ్‌లా […]

Israeli airstrikes on Gaza hospital : గాజా తాత్కాలిక ఆసుపత్రిపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి

మధ్య గాజాలో కిక్కిరిసిపోయిన ఓ ఆసుపత్రి పెరడులో తాత్కాలిక శిబిరంపై ఇజ్రాయెల్‌ దళాలు ఆదివారం వైమానిక దాడి నిర్వహించాయి. డెయిర్‌ అల్‌-బలా: మధ్య గాజాలో కిక్కిరిసిపోయిన ఓ ఆసుపత్రి పెరడులో తాత్కాలిక శిబిరంపై ఇజ్రాయెల్‌ దళాలు ఆదివారం వైమానిక దాడి నిర్వహించాయి. ఈ ఘటనలో ఇద్దరు పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. పాత్రికేయులతో సహా 15 మంది గాయపడ్డారు. యుద్ధ కల్లోలిత ప్రాంతాల నుంచి వచ్చిన వందల మంది ప్రజలు ఈ ఆసుపత్రిలో ఆశ్రయం పొందతున్నారు. దాడితో మహిళలు, […]

immediate ceasefire in Gaza.. 14 countries voted in favor గాజాలో తక్షణమే కాల్పుల విరమణ చేయాలి.. 14 దేశాలు అనుకూలంగా ఓటు

హమాస్‌ అంతమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న యుద్ధకాండను తక్షణం ఆపివేయాలని ఐక్యరాజ్యసమితి కోరింది. గాజాలో 5 నెలలుగా కొనసాగుతున్న కాల్పులకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తొలిసారి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా గతంలో ప్రవేశపెట్టిన తీర్మానాలను వ్యతిరేకించిన అమెరికా తాజా తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉంది. రంజాన్ మాసం సందర్భంగా తక్షణమే కాల్పులను విరమించుకోవాలని కోరిన ఈ తీర్మానంపై సోమవారం ఓటింగ్ జరిగింది. హమాస్‌ అంతమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్‌ […]

Israel-Hamas War: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ

ఐరాస భద్రతా మండలి తీర్మానం అనుకూలంగా ఓటేసిన రష్యా, చైనా సహా     14 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనని అమెరికా ఐక్యరాజ్యసమితి: ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య వివాదం మొదలైన అయిదు నెలల తర్వాత సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత రంజాన్‌ మాసంలో గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని సంబంధిత వర్గాలను కోరుతూ ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. 15 సభ్యదేశాలతో కూడిన మండలిలోని 10 తాత్కాలిక సభ్యదేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రష్యా, చైనా […]