Waheeda Rahman – హిందీ చిత్రసీమను ఏలిన అందాల అభినేత్రి.
భారతీయ సినీ చరిత్రలో వహీదా రెహమాన్‌ని అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా పరిగణిస్తుంటారు. ఐదు దశాబ్దాల ఆమె సినీ జీవితంలో తొంభైకిపైగా సినిమాల్లో నటించారు. 1955లో ‘రోజులు మారాయి’తో ఆమె వెండితెర ప్రస్థానం మొదలైంది. ఆనాటి దిగ్దర్శకుడు, నటుడు గురుదత్‌తో కలిసి ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్’, ‘కాలా బాజార్’, ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ లాంటి మరపురాని చిత్రాల్లో అత్యుత్తమ నటన ప్రదర్శించారు. 1965లో వచ్చిన రొమాంటిక్ డ్రామా ‘గైడ్’ ఆమె ప్రతిభకి ఓ మచ్చుతునక. ఆ […]