Canada has temporarily halted the issuance of visas to Indian citizens – కెనడా భారత పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది

భారత్‌ వ్యతిరేక శక్తులు, ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల కార్యకలాపాలకు నిలయంగా మారిన కెనడా పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన సందేశాన్ని విస్పష్టం చేసేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్‌కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. మన దేశంలో కెనడా దౌత్య కార్యాలయ సిబ్బందిని తగ్గించుకోవాలని సూచించింది. ఖలిస్థాన్‌ అనుకూల శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పునరుద్ఘాటిస్తూ ఈ విషయాలను ప్రకటించింది. కెనడాలో అధికమవుతున్న భారత్‌ వ్యతిరేక శక్తుల కార్యకలాపాలపై […]