Manipur Violence: మణిపుర్‌లో మళ్లీ కల్లోలం.. ఐపీఎస్‌ అధికారికి పిలుపు..

మణిపుర్‌లో మరోసారి కల్లోల పరిస్థితులు (Manipur Violence) నెలకొన్నాయి. విద్యార్థుల హత్యతో ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎస్‌ఎస్పీ రాకేశ్‌ బల్వాల్‌ (Rakesh Balwal)ను తన సొంత కేడర్‌ అయిన మణిపుర్‌కు బదిలీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ (Home Minitsry) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అల్లర్ల కట్టడి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Manipur violence – మణిపూర్ హింస

జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ అట్టుడుకుతోంది. ఈ ఏడాది మే నెలలో హింసాకాండ మొదలైంది. రాష్ట్రంలో హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా 175 మంది మరణించారని, 32 మంది అదృశ్యమయ్యారని, 1,108 మంది గాయపడ్డారని మణిపూర్‌ పోలీసు శాఖ వెల్లడించింది. మరణించిన 175 మందిలో 96 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు ఇంకా తీసుకెళ్లలేదని, అవి వివిధ ఆసుపత్రుల్లో మార్చురీలోనే ఉన్నాయని పేర్కొంది.అలాగే 9 మృతదేహాలను గుర్తించలేదని వివరించింది. దాడులు, ప్రతి దాడుల్లో 4,786 ఇళ్లు […]