Vijaysai Reddy: Big shame for MP Vijayasai Reddy ఎన్నికల ప్రచారంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి ఘోర అవమానం

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి ఘోర అవమానం ఎదురైంది. సీతారామపురంలో ప్రచార రథంపై ప్రసంగిస్తుండగా.. జనం ఒక్కసారిగా లేచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీ కార్యకర్తలు సైతం ప్రసంగం సమయంలోనే ఇంటిబాట పట్టారు. దీన్ని గమనించిన వైకాపా నేతలు వెళ్లవద్దు ఆగండి ఆగండి అని బ్రతిమలాడుకున్నారు. భోజనాలు ఉన్నాయి అంటూ మైక్‌లో అనౌన్స్ చేస్తూ వారిని ఆపే ప్రయత్నం చేశారు.