Hyderabad:  Kidnapping of Hyderabad student in America..అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్‌.. డాలర్స్‌ డిమాండ్‌ చేస్తూ డ్రగ్‌ మాఫియా బెదిరింపు ఫోన్‌ కాల్

ఉన్నత విద్య చదివేందుకు అమెరికా వెళ్లిన హైదరాబాద్‌ విద్యార్థి కిడ్నాప్‌కు గురైన ఘటన కలకలం రేపింది. డ్రగ్స్‌ మాఫియా కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్‌ మాఫియాకు చెందిన కిడ్నాపర్లు డబ్బు డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని నాచారంలోనున్న అతని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఈ విషయాన్ని చెప్పారు. అమెరికా డాలర్ల రూపంలో తాము అడిగిన డబ్బు పంపిస్తే అతన్ని వదిలేస్తామన్నారు. లేదంటే కిడ్నీలు.. హైదరాబాద్‌, మార్చి 21: ఉన్నత విద్య చదివేందుకు అమెరికా వెళ్లిన హైదరాబాద్‌ విద్యార్థి కిడ్నాప్‌కు గురైన […]

America Given Big Shock To China చైనాకు గట్టిషాకిచ్చిన అమెరికా..టిక్ టాక్ బ్యాన్

డ్రాగన్ కంట్రీకి గట్టిషాకిచ్చింది అమెరికా. చైనీస్ యాప్ టిక్ టాక్ నిషేధించే బిల్లుకు అమెరికా హౌస్ ఆమోదం తెలిపింది. టిక్ టాన్ నిషేధించే ఈ బిల్లు భారీ మెజార్టీతో ఆమోదిస్తూ.. యుఎస్ హౌస్ చైనాకు బలమైన సందేశాన్ని ఇచ్చింది. రాజకీయంగా విభజించిన వాషింగ్టన్‌లో, టిక్‌టాక్‌ను నిషేధించే విషయంలో అద్భుతమైన ద్వైపాక్షిక ఐక్యత ఉంది. ఎంపీలు ప్రతిపాదిత చట్టానికి అనుకూలంగా 352 మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా 65 మంది మాత్రమే ఓటేశారు. అమెరికా ప్రతినిధుల సభ బుధవారం […]

Indian Students America : ఛలో అమెరికా అంటున్న భారత విద్యార్థులు.. ఎందుకంటే ??

అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుంది. నాణ్యమైన విద్య, ఎక్కువ జీతం కోసం భారతీయ విద్యార్థులు చలో అమెరికా అంటున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థుల సంఖ్యలో 35 శాతం పెరుగుదల నమోదైంది. భారత్‌తో పోలిస్తే చదువులకు అయ్యే ఖర్చు కాస్త ఎక్కువైనా.. అమెరికాలో మంచి ఉద్యోగం దొరికితే జీవితంలో చక్కగా స్థిరపడొచ్చని ఇండియన్‌ యూత్‌ భావిస్తుంది. అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ […]

Yemen : అమెరికా డ్రోన్‌ను కూల్చేసిన హౌతీ తిరుగుబాటు దళాలు

అమెరికా(USA)కు చెందిన ఎంక్యూ-9 రిమోట్లీ పైలెటెడ్‌ డ్రోన్‌ను యెమెన్‌ (Yemen) లోని హౌతీ (Houthi) తిరుగుబాటు దళాలు కూల్చేశాయి. తమ భూభాగంపై నిఘా పెట్టి.. గూఢచర్యానికి పాల్పడుతున్న అమెరికా డ్రోన్‌ను యెమెన్‌ తీరప్రాంతంలో తమ బలగాలు కూల్చేసినట్లు హౌతీ వెల్లడించింది. అమెరికా రక్షణశాఖ అధికారులు సైతం ఈ దాడిని నిర్థారించారు. ఇజ్రాయెల్‌కు మిలటరీ సాయంలో భాగంగానే తమపై అమెరికా డ్రోన్లతో నిఘా పెట్టిందని ఈ గ్రూప్‌ ఆరోపిస్తోంది. ఇరాన్‌ మద్దతున్న హౌతీలు ఇజ్రాయెల్‌పై పలుమార్లు దాడులకు పాల్పడ్డారు. […]

USA : పశ్చిమాసియాకు అణు జలాంతర్గామిని తరలించిన అమెరికా..!

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ముదిరే కొద్దీ అమెరికా తన శక్తిమంతమైన ఆయుధ వనరులను పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఆ ప్రాంతంలోని దేశాలు ఇజ్రాయెల్‌పై దాడికి దిగకుండా నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఒహియో శ్రేణి అణు జలాంతర్గామిని ఈ ప్రాంతంలో మోహరించినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ట్విటర్‌లో ప్రకటించింది. అమెరికా నౌకా దళంలో మొత్తం నాలుగు ఒహియో శ్రేణి జలాంతర్గాములున్నాయి. కచ్చితంగా దేనిని అక్కడికి తరలించిందో మాత్రం వెల్లడించలేదు. యూఎస్‌ఎస్‌ ఫ్లోరిడా మాత్రం ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తోంది. ఈ […]

Akshardham Temple – అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలో ప్రారంభించబడింది…

ఆధునిక యుగంలో భారత్‌ వెలుపల నిర్మించిన అతి పెద్ద హిందూ దేవాలయం అమెరికాలో లాంఛనంగా ప్రారంభమైంది. న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లేలో నిర్మించిన అక్షర్‌ధామ్‌ ఆలయాన్ని ఆదివారం మహంత్‌ స్వామి మహరాజ్‌ సమక్షంలో భారీ వేడుక నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా  ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఆలయం ప్రారంభం సందర్భంగా సెప్టెంబరు 30 నుంచి 9 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించారు. న్యూయార్క్‌ నగర మేయర్‌ కార్యాలయ ఉప కమిషనర్‌ (అంతర్జాతీయ వ్యవహారాలు) దిలీప్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. ఈ ఆలయ నిర్మాణంతో […]

Texas, USA – హ్యూస్టన్‌లో గాంధీ మ్యూజియం

మహాత్మాగాంధీ జీవిత చరిత్రను తెలియజేయడంతో పాటు ఆయన అనుసరించిన అహింసా సిద్ధాంతానికి ప్రచారం కల్పించేలా అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం హ్యూస్టన్‌ నగరంలో గాంధీ మ్యూజియం అందుబాటులోకి వచ్చింది. ఇతర భవనాలకు అనుబంధంగా కాకుండా ఉత్తర అమెరికా ఖండంలో విడిగా గాంధీ మ్యూజియం ఏర్పాటుకావడం ఇదే తొలిసారి. దాని విస్తీర్ణం 13 వేల చదరపు అడుగులు. ‘ఎటర్నల్‌ గాంధీ మ్యూజియం’గా పిలుస్తున్న ఈ మ్యూజియంలోకి వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టు 15 నుంచే సందర్శకులను అనుమతిస్తున్నారు. అధికారికంగా దాని […]

United States of America (USA) – టర్కీకి చెందిన డ్రోన్‌ను కూల్చివేసింది

పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటో(NATO) సభ్యదేశం తుర్కియే(Turkey)కు చెందిన డ్రోన్‌ను అమెరికా(USA) కూల్చివేసింది. సిరియా(Syria)లో మోహరించిన అమెరికా బలగాలు.. తమ క్యాంప్‌ వైపునకు డ్రోన్‌ రావడంతో ముప్పుగా భావించి యూఎస్‌ ఫైటర్‌ జెట్లతో కూల్చివేశాయి. ఈ విషయాన్ని పెంటగాన్‌ వెల్లడించింది. నాలుగు రోజుల క్రితం అంకారాలోని తుర్కియే పార్లమెంట్‌ భవనం సమీపంలో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు తామే బాధ్యులమని కుర్దిస్థాన్‌ వర్కర్స్‌ పార్టీ ప్రకటించింది. […]