US strike : సిరియాలోని ఇరాన్‌ మద్దతున్న దళాలపై దాడి..

సిరియా (Syria)లోని ఇరాన్‌ (Iran) మద్దతున్న సాయుధ బలగాలపై అమెరికా (USA) రెండోసారి గగనతల దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందినట్లు సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యుమన్‌ రైట్స్‌ చీఫ్‌ రమీ అబ్దెల్‌ రెహమాన్‌ వెల్లడించారు. ఇరాక్‌, సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ మద్దతున్న సాయుధ బలగాలు గత కొన్ని రోజుల్లో 12 సార్లు దాడి చేశాయి. వాటికి ప్రతీకారంగానే అమెరికా ఈ దాడులు చేస్తోంది. గాజాలో జరుగుతోన్న సంక్షోభానికి ఈ […]