Russia-Ukraine war:  రష్యా క్షిపణి దాడుల్లో 8 మంది మృతి

కీవ్‌: ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్‌పైకి రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. శుక్రవారం రాత్రి నుంచి జరిపిన దాడుల్లో 8 మంది చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు.  రష్యా 32 ఇరాన్‌ తయారీ షహీద్‌ డ్రోన్లను, ఆరు క్షిపణులను ప్రయోగించగా 28 డ్రోన్లను, 3 క్రూయిజ్‌ మిస్సైళ్లను కూలి్చవేశామని ఉక్రెయిన్‌ ఆర్మీ తెలిపింది. తాజా దాడులపై రష్యా మిలటరీ ఎటువంటి ప్రకటనా చేయలేదు.

Russia – దాడిలో రష్యా యుద్ధనౌక ధ్వంసం

రష్యా ఆధీనంలోని క్రిమియాలో ఉన్న కెర్చ్‌ నగరంపై ఉక్రెయిన్‌ సైన్యం విరుచుకుపడింది. ఒక్కసారిగా 15 క్షిపణులను ప్రయోగించింది. వీటిలో 13 అస్త్రాలను రష్యా కూల్చేసింది. ఓ క్షిపణి రష్యాకు చెందిన అత్యాధునిక యుద్ధనౌకను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ నష్టం తీవ్రత ఎంతన్నది వెల్లడి కాలేదు. దెబ్బతిన్న నౌకలో కల్బిర్‌ క్షిపణులు ఉన్నట్లు ఉక్రెయిన్‌ వాయుసేన కమాండర్‌ మైకొలా ఒలెస్చుక్‌ తెలిపారు. ‘‘మరో నౌక మాస్కోవా బాట పట్టింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది ఏప్రిల్‌లో ఉక్రెయిన్‌ […]

Russia Attack : అవ్వ-మనవడి మృతి

ఉక్రెయిన్‌లోని ఖర్కివ్‌ నగరంపై రష్యా శుక్రవారం జరిపిన క్షిపణి దాడిలో 10 సంవత్సరాల బాలుడు, అతని అవ్వ దుర్మరణం పాలయ్యారు. తెల్లవారుజామున దాడి జరిగిన వెంటనే కూలిన భవన శిథిలాల నుంచి బాలుడి మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికితీశారు. ఇదే దాడిలో 11 నెలల చిన్నారి సహా 30 మంది గాయపడ్డారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు.

Rocket Attack : ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. దేశ తూర్పు ప్రాంతం ఖర్కివ్‌లోని హ్రోజా గ్రామంలో కెఫేపై గురువారం జరిగిన రాకెట్‌ దాడిలో సుమారు 50 మంది పౌరులు మృతి చెందారు. ఆ సమయానికి కెఫేలో 60 మంది వరకూ ఉన్నారు. ఇటీవలి కాలంలో సంభవించిన అతిపెద్ద ప్రాణనష్టం ఇదే. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ ఘటనను ధ్రువీకరించారు. మృతుల్లో ఆరేళ్ల బాలుడూ ఉన్నట్లు స్థానిక గవర్నర్‌ వెల్లడించారు. దాడికి ఉపయోగించింది ఇస్కందర్‌ క్షిపణిగా గుర్తించారు. ఉక్రెయిన్‌ దక్షిణ ప్రాంతంలోని […]

Russia : ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 31 డ్రోన్‌లను కూల్చివేసింది

ఉక్రెయిన్‌ చేసిన భారీ డ్రోన్ల దాడిని విఫలం చేశామని రష్యా పేర్కొంది. తమ సరిహద్దు ప్రాంతాలకు కీవ్‌ పంపిన 31 డ్రోన్లను.. తమ గగనతల రక్షణ వ్యవస్థ నేలకూల్చిందని తెలిపింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత తమ సరిహద్దులపై ఉక్రెయిన్‌ చేసిన అతి పెద్ద దాడి ఇదేనని చెప్పింది. మరోవైపు ఫ్రాన్స్‌కు పారిపోయిన రష్యా పాత్రికేయురాలు మరీనా ఒవస్యానికోవాకు మాస్కో న్యాయస్థానం బుధవారం ఎనిమిదిన్నరేళ్ల జైలు శిక్ష విధించింది. రష్యా అధికారిక ఛానల్‌ వన్‌లో పనిచేసిన మరీనా.. ఉక్రెయిన్‌పై […]

Russia attacked Ukraine’s – ఏకైక ప్రధాన నౌకాశ్రయం ఒడెస్సాపై రష్యా దాడి చేసింది.

ఉక్రెయిన్‌(Ukraine)కు ఉన్న ఏకైక ప్రధాన పోర్టు అయిన ఒడెస్సాపై రష్యా (Russia) విరుచుకుపడింది. ఈ దాడిలో పోర్టు, ధాన్యం నిల్వ గోదాములు, ఓ హోటల్‌ తీవ్రంగా దెబ్బతిన్నాయి. రష్యా ఆధీనంలోని క్రిమియా నౌకాదళ స్థావరం ప్రధాన కార్యాలయంపై ఉక్రెయిన్‌ క్షిపణి దాడి చేసిన కొన్ని రోజుల్లోనే ఇది చోటు చేసుకోవడం గమనార్హం. మొత్తం 12 కల్బిర్‌ క్షిపణులు, 19 డ్రోన్లు, రెండు ఒనెక్స్‌ సూపర్‌ సోనిక్‌ క్షిపణులను ప్రయోగించింది. వీటిల్లో కల్బిర్‌ క్షిపణులను సబ్‌మెరైన్లు, నౌకలపై నుంచి ప్రయోగించినట్లు […]