TAL National Badminton Championships : జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌….

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ TAL జాతీయ బ్యాడ్మింటన్‌షిప్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. పశ్చిమ లండన్‌లోని ఆస్టర్లీ స్పోర్ట్స్‌, అథ్లెటిక్స్‌ సెంటర్‌లో మార్చి 16-, ఏప్రిల్‌ 6న పోటీలు నిర్వహించింది.  లండన్‌తో పాటు యూకేలోని ఇతర సమీప కౌంటీల నుంచి ఔత్సాహిక తెలుగు ఆటగాళ్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మెన్స్‌ డబుల్స్‌, మెన్స్‌ 40+ డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌, విమెన్స్‌ డబుల్స్‌, విమెన్స్‌ 35+ డబుల్స్‌, అండర్‌-16.. ఇలా వివిధ కేటగిరీలలో కలిపి మొత్తంగా 250 మంది బ్యాడ్మింటన్‌ […]

London Heathrow Airport: యూకేలోని హీత్రూ ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీకొన్నాయి.

 ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీకొన్నాయి. వర్జిన్‌ అట్లాంటిక్‌కు చెందిన బోయింగ్‌ 787-9 రకం విమానం ప్రయాణం ముగించుకొన్నాక.. దానిని మరో ప్రదేశానికి లాక్కెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అది టెర్మినల్‌ వద్ద బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఎయిక్రాఫ్ట్‌ను తాకింది.  ఈ ఘటనలో రెండూ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇరు సంస్థలు ఈ విషయాన్ని ఓ ప్రకటనలో ధ్రువీకరించాయి. ‘‘మా ఎయిర్‌క్రాఫ్ట్‌ ఎంత మేరకు దెబ్బతిన్నదో […]

Golden Toilet Theft.. : రూ.50 కోట్ల విలువైన ‘బంగారు టాయిలెట్’‌ చోరీ.. 

ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ దొంగ కోట్ల విలువైన బంగారు టాయిలెట్‌ కమోడ్‌ని కొట్టేశాడు. దాదాపు 300 ఏళ్ల నాటి బ్లెన్‌హీమ్ అనే ప్యాలెస్ నుంచి దీనిని దొంగిలించాడు. ఈ కమోడ్ విలువ 48,00,000 పౌండ్లు అంటే సుమారు రూ. 50.36 కోట్లు ఉంటుందని ప్రాధమిక అంచనా వేశారు. బంగారు టాయిలెట్‌ను తానే దొంగిలించినట్టు 39 ఏళ్ల జేమ్స్ షీన్ అనే దొంగ అంగీకరించాడు. ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ దొంగ […]

Rishi Sunak : gets a shock in the election surveys ఎన్నికల​ సర్వేల్లో రిషి సునాక్‌కు షాక్‌

లండన్‌: బ్రిటన్‌లో ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు జరిగితే భారత సంతతికి చెందిన రిషి సునాక్‌తోపాటు ఆయన కేబినెట్‌లోని సగానికి పైగా మంత్రులకు పరాజయం తప్పదని ముందస్తు సర్వేలో తేలింది. అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి 100 పార్లమెంట్‌ స్థానాలు కూడా దక్కడం గగనమేనని, అదే సమయంలో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ 468 సీట్లు గెలుచుకుని, 286 సీట్ల మెజారిటీ సాధిస్తుందని కూడా అంచనా వేసింది. బెస్ట్‌ ఫర్‌ బ్రిటన్‌ తరఫున సర్వేషన్‌ సంస్థ 15,029 మందితో తాజాగా సర్వే జరిపింది. […]

UK – ‘లాఫింగ్‌ గ్యాస్‌’పై నిషేధం

లాఫింగ్‌ గ్యాస్‌గా పిలిచే నైట్రస్‌ ఆక్సైడ్‌ను వినోదభరిత కార్యకలాపాల కోసం వినియోగించడంపై బ్రిటన్‌ ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది. ఆ డ్రగ్‌ను ఉత్పత్తి చేయడం, సరఫరా, విక్రయించడం వంటివి చేస్తే జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వచ్చింది. ఆరోగ్య సంరక్షణతోపాటు పరిశ్రమల్లో చట్టబద్ధంగా నైట్రస్‌ ఆక్సైడ్‌ను వినియోగించడాన్ని నిషేధం నుంచి మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్‌ ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. యూకేలో 16-24 ఏళ్ల వయసువారు అత్యధికంగా వినియోగిస్తున్న మూడో […]