Turkey : ఉద్రిక్తంగా మారిన పాలస్తీనా మద్దతుదారుల ర్యాలీ..

గాజాపై ఇజ్రాయెల్‌ (Israel) దాడులను ఆపాలంటూ అంతర్జాతీయంగా పలు దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో పాలస్తీనా ( Palestine)కు మద్దతుగా తుర్కియే ( Turkey)లో చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. గాజాలో పరిస్థితులపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ సోమవారం తుర్కియే వచ్చారు. ఆయన రావడానికి కొద్ది గంటల ముందు తుర్కియే రాజధాని అంకారాలో పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో నిరసనకారులు అంకారాలో అమెరికా సైనిక బలగాలు […]

United States of America (USA) – టర్కీకి చెందిన డ్రోన్‌ను కూల్చివేసింది

పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటో(NATO) సభ్యదేశం తుర్కియే(Turkey)కు చెందిన డ్రోన్‌ను అమెరికా(USA) కూల్చివేసింది. సిరియా(Syria)లో మోహరించిన అమెరికా బలగాలు.. తమ క్యాంప్‌ వైపునకు డ్రోన్‌ రావడంతో ముప్పుగా భావించి యూఎస్‌ ఫైటర్‌ జెట్లతో కూల్చివేశాయి. ఈ విషయాన్ని పెంటగాన్‌ వెల్లడించింది. నాలుగు రోజుల క్రితం అంకారాలోని తుర్కియే పార్లమెంట్‌ భవనం సమీపంలో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు తామే బాధ్యులమని కుర్దిస్థాన్‌ వర్కర్స్‌ పార్టీ ప్రకటించింది. […]