Tribal women : గిరిజన మహిళల ఆర్థిక స్వాతంత్య్రం…!
స్వశక్తితో తాము నిర్వహిస్తున్న పరిశ్రమను విస్తరించి మరికొంత మందికి ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారు ఏటూరునాగారం మండల కేంద్రంలో డ్రైమిక్స్ పరిశ్రమ నిర్వహిస్తున్న మహిళలు. మహిళల పొదుపు సంఘంలో సభ్యులుగా చేరిన తమను గ్రామైక్య సంఘం నుంచి జాయింట్ లయబిలిటీ గ్రూపు సభ్యులుగా ఎంపిక చేసి ఐటీడీఏ ఈ అవకాశాన్ని కల్పించిందని, మరో వంద మందికైనా తమ పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామంటున్నారు.