A train accident took place in Uttarpradesh – ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర స్టేషన్‌లో రైలు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ రైలు ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చింది. ప్రయాణికులు అప్పటికే దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. రైలు ప్లాట్‌ఫాంపైకి ఎలా వచ్చిందో తెలియట్లేదని స్టేషన్‌ అధికారులు పేర్కొన్నారు.  “షకుర్‌ బస్తీ నుంచి వస్తున్న ఈఎంయూ(ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్‌) ట్రైన్‌ 10:49 గంటలకు మధుర స్టేషన్‌కు వచ్చి ఆగింది. ప్రయాణికులందరూ రైలు నుంచి దిగి వెళ్లిపోయారు. అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియదు గానీ.. రైలు ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లింది. […]