‘లైన్‌మ్యాన్’ మూవీ ట్రైలర్

తెలుగు, తమిళ సినిమాల్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో త్రిగుణ్. ఇప్పుడీ హీరో ‘లైన్ మ్యాన్’ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. వి రఘుశాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. మాండ్య ప్రాంతంలోని సమీప గ్రామాల్లోని అక్కడి వాతావరణాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ కామెడీ ప్రదానంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

MAD – ‘మ్యాడ్‌’ ట్రైలర్‌ చూశారా!

సంగీత్‌ శోభన్‌, నార్నె నితిన్‌, రామ్‌ నితిన్‌, శ్రీ గౌరి ప్రియ రెడ్డి కీలక పాత్రల్లో కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన చిత్రం ‘మ్యాడ్‌’ (MAD). ఇంజినీరింగ్‌ కళాశాల నేపథ్యంలో సాగే కథతో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మీరూ ఓ లుక్కేయండి.