Ankita-prathana pair that won India : భారత్‌ను గెలిపించిన అంకిత–ప్రార్థన జోడీ 

చాంగ్షా (చైనా): బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా జోన్‌ మహిళల టీమ్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత జట్టుకు మూడో విజయం లభించింది. దక్షిణ కొరియాతో శుక్రవారం జరిగిన నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 2–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో రుతుజా భోస్లే 6–2, 6–2తో సోహున్‌ పార్క్‌పై నెగ్గి భారత్‌కు 1–0తో ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో అంకిత రైనా 2–6, 3–6తో సుజియోంగ్‌ జాంగ్‌ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక డబుల్స్‌ […]