‘Tiger Nageswara Rao’ – చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’.

పంజా విసరడమే ఆలస్యం అంటున్నాడు ‘టైగర్‌ నాగేశ్వరరావు’. బాక్సాఫీస్‌ దగ్గర వేటకి సిద్ధం అవుతున్న అతని అసలు కథేమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రవితేజ కథానాయకుడిగా… అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. నుపూర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. రేణుదేశాయ్‌, అనుపమ్‌ ఖేర్‌ కీలకపాత్రలు పోషించారు. వంశీ దర్శకుడు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాత. అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ట్రైలర్‌ని అక్టోబరు 3న విడుదల చేస్తున్నట్టు సినీ వర్గాలు […]