Union Home Minister Amit Shah visited Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల: తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు తితిదే ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అమిత్‌షాకు శ్రీవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఈవో అందజేశారు.

vijay thalapathy : అమ్మ కోసం ఆలయాన్నే కట్టించిన హీరోఅమ్మ

స్టార్‌ హీరోగా రాణిస్తున్న  vijay thalapathy రాజకీయ రంగప్రవేశాన్ని అందరూ ఊహించిందే! కానీ పాలిటిక్స్‌ కోసం నటనకు స్వస్తి చెబుతారని ఎవరూ ఊహించలేదు. ఈయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. త్వరలో తాను నటించే 69వ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చివరి చిత్రానికి ఆయన ఏకంగా రూ. 250 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. తల్లంటే ఎంతో ఇష్టంఈ విషయం […]

Octopus mock drill in front of Srivari temple. శ్రీవారి ఆలయం ముందు ఆక్టోపస్ మాక్ డ్రిల్.. బిత్తరపోయిన భక్తులు

తిరుమల శ్రీవారి ఆలయం ముందు అక్టోపస్ మాక్ డ్రిల్ భక్తులను కలవరపాటుకు గురి చేసింది. ఉగ్రవాదుల ముప్పు ఉన్న ఆలయం పై దాడి జరిగితే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై మాక్ డ్రిల్ నిర్వహించిన ఆక్టోపస్ ఎన్ ఎస్ జి బలగాల హడావుడి భక్తులను అయోమయానికి గురిచేసింది. అర్ధరాత్రి శ్రీవారికి ఏకాంత సేవ పూర్తయ్యాక భద్రతా సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉగ్రవాదులు ఆలయంలోకి ప్రవేశిస్తే భక్తులను ఎలా రక్షించాలి, ఆలయ తలుపులు మూసివేస్తే ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై […]

KEADARNATH – రాహుల్‌ గాంధీ కేదార్‌నాథ్‌ మందిరాన్ని దర్శించారు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆదివారం ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ మందిరాన్ని దర్శించారు. ప్రైవేటు హెలికాప్టర్‌లో మందిరం చేరుకున్న ఆయనకు ఆలయ పూజారులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు స్వాగతం పలికారు. ‘‘ఈ రోజు ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ థామ్‌ను దర్శించి పూజ చేసుకున్నాను. హర్‌ హర్‌ మహాదేవ్‌’’ అని రాహుల్‌ తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. సాయంత్రం హారతిలోనూ పాల్గొన్నారు. ‘ఛాయ్‌ సేవా’లో భాగంగా యాత్రికులకు టీ అందించారు. రాత్రికి రాహుల్‌ అక్కడే బస చేస్తారని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Akshardham Temple – అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలో ప్రారంభించబడింది…

ఆధునిక యుగంలో భారత్‌ వెలుపల నిర్మించిన అతి పెద్ద హిందూ దేవాలయం అమెరికాలో లాంఛనంగా ప్రారంభమైంది. న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లేలో నిర్మించిన అక్షర్‌ధామ్‌ ఆలయాన్ని ఆదివారం మహంత్‌ స్వామి మహరాజ్‌ సమక్షంలో భారీ వేడుక నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా  ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఆలయం ప్రారంభం సందర్భంగా సెప్టెంబరు 30 నుంచి 9 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించారు. న్యూయార్క్‌ నగర మేయర్‌ కార్యాలయ ఉప కమిషనర్‌ (అంతర్జాతీయ వ్యవహారాలు) దిలీప్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. ఈ ఆలయ నిర్మాణంతో […]