CM Revanth Reddy Telangana In కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవడం ఇంకా ప్రారంభించనే లేదు..

‘‘కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవడం ఇంకా ప్రారంభించనే లేదు.. తుపాకీ సిద్ధంగా ఉంది. ఒక్క తూటా చాలు.. నేను పిల్లులు, కుక్కలను కొట్టను. కొడితే పులినే కొడతాను’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి ‘ఇండియా టీవీ’ సీనియర్‌ జర్నలిస్ట్‌ రజత్‌ శర్మ నిర్వహించే ‘ఆప్‌ కీ అదాలత్‌’ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ను కొట్టాలంటే అసెంబ్లీలోనే వెళ్లి కొట్టేవాడినని.. అందుకు కుర్చీయే (అధికారమే) అవసరం లేదని చెప్పారు. అలాగే.. కవితను తెలంగాణలో జరిగిన అవినీతికి అరెస్టు చేయలేదని, ఢిల్లీలో […]

HarishRao Brs Party Mla : ఇచ్చిన హామీలు తప్పిన కాంగ్రెస్

Telangana: తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కొండ భూదేవి గార్డెన్‌లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సిద్దిపేట పట్టణ కార్యకర్తల సమావేశంలో హరీష్ పాల్గొని ప్రసంగించారు. ‘‘మనం పదేళ్లు పాలించినం… వాళ్ళు వచ్చి నాలుగు నెలలు కాలేదు.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది’’ అని అన్నారు. సిద్దిపేటలో సగం కట్టిన వెటర్నరీ కాలేజీని రద్దు చేసి కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట, […]

Telangana: బీఆర్ఎస్‌కు మరో షాక్.. నెగ్గిన అవిశ్వాసం..

తెలంగాణలో బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు సీనియర్లు పార్టీని వీడుతుంటే.. మరోవైపు స్థానిక సంస్థల్లో ఆ పార్టీ మరింత బలహీనపడుతుంది. తాజాగా కామారెడ్డి బీఆర్‌ఎస్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆమె ఛైర్ పర్సన్ పదవి కోల్పోయారు. కామారెడ్డి కొత్త మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా కాంగ్రెస్‌ కౌన్సిలర్ గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు సీనియర్లు పార్టీని వీడుతుంటే.. మరోవైపు స్థానిక […]

Konda Surekha: భేదాభిప్రాయాలు వీడనాడి పార్టీ గెలుపునకు పనిచేయాలని సురేఖ తెలిపారు.

మెదక్‌లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని… ఇతర పార్టీలు బీసీలను పట్టించుకోలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. నేడు పఠాన్ చెరు మండలం గణేష్ గడ్డ గణేష్ దేవస్థానం వద్ద కాంగ్రెస్ ప్రచార రథాలకు పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి: మెదక్‌లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని… ఇతర పార్టీలు బీసీలను పట్టించుకోలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. […]

Kavitha Liqour Case : CBI produced Kavitha in court. కవితను కోర్టులో హాజరుపరిచిన సీబీఐ..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన కవితకు కష్టాలు రెట్టింపయ్యాయి. లిక్కర్ స్కామ్ కేసులో కవితను గురువారం అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఆమెను శుక్రవారం ఉదయం 10.00 గంటలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరుపరిచారు. 5 రోజుల పాటు కవితను సీబీఐ కస్టడీకి కోరారు. ఢిల్లీ, హైదరాబాద్ సహా పలు ప్రదేశాల్లో ఈ స్కామ్ కు సంబంధించిన సమావేశాలు జరిపినట్లు చెబుతోంది సీబీఐ. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన కవితకు […]

BRS : Cantonment Zone BRS Candiate Niveditha : కంటోన్మెంట్ బిఆర్‌ఎస్ అభ్యర్థి నివేదిత!

హైద‌రాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా నివేదిత పేరు ఖరారైంది. దివంగ‌త ఎమ్మెల్యే సాయ‌న్న కూతురు నివేదిత‌ను కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా కేసీఆర్ ప్ర‌క‌టించారు. బుధవారం పార్టీ ముఖ్య నేత‌ల‌తో చ‌ర్చించిన అనంత‌రం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్‌ఎస్‌ నుంచి  గెలుపొందిన లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన విషయంలో తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. దీంతో లాస్య నందిత సోద‌రి నివేదిత‌ను బీఆర్‌ఎస్‌ బ‌రిలోకి దింపింది. […]

Harish Rao Comments On CM Revanth Reddy : Brs Party : నోటితో తియ్యగా మాట్లాడి నొసటితో వెక్కిరిస్తున్న రేవంత్‌ : హరీష్‌ రావు వ్యాఖ్యలు :

సంగారెడ్డి: తెలంగాణలో కాంగ్రెస్‌ 100 రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌ రావు. కాంగ్రెస్‌ అభయ హస్తం అక్కరకు రాని హస్తంలాగా తయ్యారైందని ఎద్దేవా చేశారు.  కాగా, హరీష్‌ రావు బుధవారం సంగారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భండా ఆయన మాట్లాడుతూ..‘ఇటీవల కేసీఆర్‌ ఎండిపోయిన పంటలను పరిశీలించారు. కేసీఆర్‌ సిరిసిల్లలో వడ్ల బోనస్‌ గురించి మాట్లాడితే సీఎం రేవంత్‌ రెడ్డి చెత్త పదజాలంతో ఏవోవో వ్యాఖ్యలు చేశారు. నువ్వు ముఖ్యమంత్రివా […]

Phone tapping case Radhakishan Rao’s remand extended : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు : రాధాకిషన్‌రావు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి రోజుకో ట్విస్ట్‌ చోటుచేసుకుంటోంది. తాజాగా ఈ కేసు వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 12 వరకు రిమాండ్‌ విధించిన అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రాధాకిషన్‌రావుకు సంబంధించి వారం రోజుల కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇక, విచారణ సందర్భంగా తనను జైలులో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం […]

Congress – MIM : ఎంఐఎంతో కాంగ్రెస్‌ దోస్తీ కుదిరింది..Feroze Khan sensational comments…

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో సై అంటే సై అంటూ తలపడుతున్నాయి.. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆ పార్టీలో చిచ్చు రేపాయి.. ఎంఐఎంతో పొత్తు కుదిరిందంటూ ఆయన బాంబు పేల్చారు.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో సై అంటే సై అంటూ తలపడుతున్నాయి.. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత […]

Telangana: Former MLA Shakeel’s son Rahel was arrested by the police : మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహేల్‎ను పోలీసులు అరెస్టు చేశారు.

పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఏడాది డిసెంబర్‎లో ప్రజా భవన్ ముందు ఉన్న భారీ కేట్లు ఢీ కొట్టిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహేల్‎ను పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది డిసెంబర్ 24న ఘటన జరిగిన తర్వాత దుబాయ్ పారిపోయాడు ఎమ్మెల్యే కొడుకు. అయితే అప్పటినుండి అతడి అరెస్టు కోసం పంజాగుట్ట పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. […]