Two more days of heavy rains in Telangana..says weather reports – తెలంగాణలో మరో రెండురోజులు మోస్తరు వర్షాలు..!

తెలంగాణ: తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతవరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. అయితే, గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శుక్రవారం […]

54 tenders for purchase of grain – మిల్లుల్లో మూలుగుతున్న ధాన్యాన్ని గ్లోబల్‌ టెండర్ల ద్వారా….

హైదరాబాద్‌: రాష్ట్రంలోని మిల్లుల్లో మూలుగుతున్న ధాన్యాన్ని గ్లోబల్‌ టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంచి స్పందన లభించింది. తొలి విడతగా 25 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యాన్ని విక్రయించాలని భావించిన పౌరసరఫరాల సంస్థ ఈ మేరకు గత నెలలో టెండర్లను ఆహ్వనించింది. 25 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి , ప్రతి ఎల్‌ఎంటీ ఒక లాట్‌గా ఆన్‌లైన్‌లో బిడ్స్‌ ఆహ్వనించింది. గురువారంతో గడువు ముగియగా, సాయంత్రం 5 గంటలకు అధికారులు టెక్నికల్‌ బిడ్లు […]

Minister KTR responded -జాహ్న‌వి మృతి క‌ల‌చివేసింది.. అమెరికా పోలీసు ప్ర‌వ‌ర్త‌న బాధాక‌రం

Minister KTR | క‌ర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి అమెరికాలోని సియోటెల్‌లో జ‌రిగిన రోడ్డుప్ర‌మాదంలో చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే జాహ్న‌వి ప్రాణాల‌కు విలువ లేదంటూ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పోలీసు అధికారి నిర్ద్వంద వ్యాఖ్య‌ల‌కు తీవ్రంగా క‌ల‌త చెందిన‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు. భార‌త్‌లోని అమెరికా రాయ‌బారి యూఎస్ ప్ర‌భుత్వ అధికారుల‌ను సంప్ర‌దించి, జాహ్న‌వి కుటుంబానికి న్యాయం చేయాల‌ని అభ్య‌ర్థిస్తున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు. […]

New job posts should be given.. – జిల్లాకు కొత్త పోస్టులు ఇవ్వండి..

కుటుంబ సభ్యులను కోల్పోయి వారి స్థానంలో ఉద్యోగం(Job) కోసం ఎదురుచూస్తున్న వారికి ఏళ్లుగా నిరాశే ఎదురవుతోంది. ఇతర శాఖల్లో కారుణ్య నియామకాలు త్వరితగతిన జరుగుతున్నా పంచాయతీరాజ్‌లో ఏళ్లు గడిచినా అడుగు ముందుకు పడటం లేదు. అటు ఆప్తులను కోల్పోయి, ఇటు ఉద్యోగాలు రాక ఆ కుటుంబాలు ఎంతో మనోవేదనకు గురవుతున్నాయి. ఖాళీలు లేకపోవడమే దీనికి కారణమని అధికారులు తెలిపారు. జిల్లాకు సూపర్‌ న్యూమరరీ(తాత్కాలికంగా) కొత్త పోస్టులు మంజూరు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ నుంచి పంచాయతీరాజ్‌ రూరల్‌ ఎంప్లాయిమెంట్‌ […]

Minister KTR responded on jahnavi’s death -జాహ్న‌వి మృతి క‌ల‌చివేసింది.. అమెరికా పోలీసు ప్ర‌వ‌ర్త‌న బాధాక‌రం : మంత్రి కేటీఆర్

Minister KTR | క‌ర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి అమెరికాలోని సియోటెల్‌లో జ‌రిగిన రోడ్డుప్ర‌మాదంలో చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే జాహ్న‌వి ప్రాణాల‌కు విలువ లేదంటూ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పోలీసు అధికారి నిర్ద్వంద వ్యాఖ్య‌ల‌కు తీవ్రంగా క‌ల‌త చెందిన‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు. భార‌త్‌లోని అమెరికా రాయ‌బారి యూఎస్ ప్ర‌భుత్వ అధికారుల‌ను సంప్ర‌దించి, జాహ్న‌వి కుటుంబానికి న్యాయం చేయాల‌ని అభ్య‌ర్థిస్తున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు. […]

Another ED notice to Kavitha! – కవితకు మరోసారి ఈడీ నోటీస్! రేపే అరెస్ట్ ఉంటుందా!?

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి అనూహ్యంగా మలుపు తిరిగింది. గత కొద్ది రోజులుగా స్తబ్ధతగా ఉన్న ఈ కేసు ఉన్నపలంగా తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు (BRS MLC Kavitha) తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపే (శుక్రవారం) విచారణకు హాజరుకావాలంటూ నోటీసులో పేర్కొంది. దీంతో ఏం జరుగుతోందోనన్న సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. గతంలోనే కవితను అరెస్ట్ చేస్తారని వార్తలు షికార్లు […]

Viral Fever Everywhere.. – ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్…

ములుగులోని 17 ఆరోగ్య కేంద్రాల్లో అస్వస్థతకు గురైన వారు అధికంగా ఉన్నారు. మహబూబాబాద్‌, హనుమకొండ, భూపాలపల్లి తదితర ప్రాంతాల నుంచి ప్రజలు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి(MGM Hospital) వెళ్లి సహాయం పొందుతున్నారు. ఈ ప్రాంతంలో వర్షాకాలం కావడంతో అస్వస్థతకు గురయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వర్షం వల్ల దోమలు వృద్ధి చెందడంతోపాటు మలేరియా(Maleria), డెంగ్యూ(Dengue) వంటి రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఎక్కువ మంది డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రికి వెళ్తున్నారు. డెంగ్యూ జ్వరం ఈజిప్టి […]

Bharat, a B.Tech student from Thirmanpally died of dengue – తిర్మన్‌పల్లికి చెందిన భరత్ అనే బీటెక్ విద్యార్థి డెంగ్యూతో మృతి చెందాడు

డెంగీ కేసులు జి ల్లాలో క్రమంగా పెరుగుతున్నాయి. ఇందల్‌వాయి మండలం తిర్మన్‌పల్లికి చెందిన బీటెక్‌ విద్యార్థి భరత్‌ డెంగీతో బుధవారం మృతి చెందాడు. జ్వరం రావడంతో ఇంటివద్ద మందులు వాడినా తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ ప్రైవేట్‌ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేరాడు. మంగళవారం విద్యార్థి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైద్రాబాద్‌లోని నిమ్స్‌కు తలించగా చికిత్స పొదు తూ మృతి చెందాడు. జిల్లాలో డెంగీ జ్వరంతో నెలలో ఒకరిద్దరు మరణిస్తున్నారు. రెండు […]

One in every ‘three’ is a tenant farmer! – ప్రతి ‘ముగ్గురి’లో ఒకరు కౌలు రైతే!

తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో అత్యధికులు కౌలుదారులేనని  రైతు స్వరాజ్యవేదిక వెల్లడించింది. 2014 నుంచి 2022 వరకు 800 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే అందులో 75 నుంచి 80 శాతం మంది కౌలుదారులేనని తన అధ్యయనంలో నిగ్గుతేల్చింది. రాష్ట్రంలో కౌలు రైతుల సమస్యలపై 2022లో చేసిన అధ్యయన నివేదికలోని ముఖ్యాంశాలివీ… 2022 మే, జూన్‌ నెలల్లో 34 గ్రామాల్లోని 7744 మంది రైతులను సర్వేచేస్తే అందులో 2753 (35.6శాతం) మంది కౌలుదారులని తేలింది. ప్రతి ముగ్గురిలో ఒకరు […]

A school bus that went out of control and plunged into the flood waters – అదుపు తప్పి వరద నీటిలోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు

శంషాబాద్‌ రూరల్‌: ఓ ప్రైవేటు స్కూలు బస్సు అదుపుతప్పి వాగుపక్కన వరద నీటిలోకి దూసుకెళ్లింది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. మండలంలోని సుల్తాన్‌పల్లి–కేబీ దొడ్డి గ్రామాల మధ్యలో ఉన్న ఎంటేరు వాగులో వర్షాల కారణంగా వరదనీరు పారుతోంది. వాగుపై సుల్తాన్‌పల్లి శివారులో చిన్న కల్వర్టు ఉంది. ఏడాది కిందట ఈ కల్వర్టు పూర్తిగా దెబ్బతిని రెండు చోట్ల భారీ గుంతలు పడ్డాయి. ఇదిలా ఉండగా.. మంగళవారం వాగులో వరద పెరగడంతో రాకపోకలను నిలిపివేశారు. ఇరు వైపులా గ్రామాల శివారులో […]