Stones are left..! – రాళ్లు మిగిలాయి..!

దంతాలపల్లి, మహబూబాబాద్‌: ప్రకృతి విలయతాండవం చేసింది. ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీవర్షాలకు రైతన్న అతలాకుతలమయ్యారు. పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. రాళ్లురప్పలతో సాగుభూమి పనికి రాకుండా పోయింది. మహబూబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం రేపోణి గ్రామానికి చెందిన వీరబోయిన భిక్షం తనకున్న 5 ఎకరాల్లో వరి వేశారు. కుమ్మరికుంట్ల శివారులోని పెద్దచెరువు మత్తడి ఉద్ధృతితో ఒక్కసారిగా కట్ట తెగి సమీపంలోని పొలం మునిగిపోయింది. మూడు ఎకరాలు నామరూపాలు లేకుండా పోయింది. పొలంలో రాళ్లే మిగిలాయని […]

‘Sadak Bandh’ – ‘సడక్‌ బంద్‌’

చేర్యాలను రెవెన్యూ డివిజన్‌ చేయాలని అఖిలపక్షం, ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. 29న ‘సడక్‌ బంద్‌’కు పిలుపునిచ్చిన ఐకాస.. పక్షం రోజులుగా ప్రచారం చేస్తోంది. దీంతో శుక్రవారం ఉదయమే ఐకాస, అఖిలపక్ష నాయకుల ఇళ్లకు వెళ్లిన  పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వారిని కొమురవెల్లి ఠాణాకు తరలించారు. విషయం తెలుసుకున్న నిరసనకారులు మూడు బృందాలుగా విడిపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి మూడుచోట్ల రాస్తారోకో చేశారు. ఒక బృందం చేర్యాల పాతబస్టాండు వద్ద, […]

Nalgonda : బడి అంటేనే భయం!

ఇది భూత్పూర్‌ మండలం అమిస్తాపూర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. గతేడాది ఆగస్టులో ‘మన ఊరు – మన బడి’ పథకం కింద ఇక్కడ గుత్తేదారు చేపట్టిన ఇప్పటికీ పూర్తి కాలేదు. కార్యాలయ గదితో పాటు మరో గదికి మరమ్మతులు పూర్తిచేశారు. మరమ్మతులు పూర్తిచేసిన గదిలో గుత్తేదారు నిర్మాణ సామగ్రిని భద్రపరుచుకున్నారు. గత్యంతరం లేకపోవటంతో విద్యార్థులను శిథిలావస్థకు చేరిన గదిలోనే కూర్చోబెట్టి పాఠాలు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు పైకప్పు పెచ్చులూడి విద్యార్థులపై పడతాయోనని ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. […]

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసేందుకు అక్టోబర్‌ 1న పాలమూరుకు వస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ పట్టణం అమిస్తాపూర్‌లో జరుగుతున్న సభా ఏర్పాట్లను శుక్రవారం ఆమె ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తోందన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం పనులు […]

KTR : ఎన్టీఆర్‌ ఆరాధ్య దైవమని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కొనియాడారు

ఖమ్మం: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఎన్టీఆర్‌ ఆరాధ్య దైవమని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కొనియాడారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌ బండ్‌పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ పార్క్‌ సహా విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో కలిసి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఆప్తుడు విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర […]

Nalgonda : వానాకాలం పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంపు అంతంత మాత్రంగానే ఉంది

కేంద్ర ప్రభుత్వ వానాకాలం పంటల మద్దతు ధర పెంపు అంతంత మాత్రంగానే ఉంది. పెరిగిన పెట్టుబడులతో పోల్చితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సేకరించే పంటలకు గిట్టుబాటు ధర ఆశాజనకంగా లేకపోవడంతో అన్నదాతలు దిగులు చెందుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధికంగా సాగయ్యే వరికి ఏ గ్రేడ్‌ రకానికి రూ.2203 ఇచ్చేలా ఎఫ్‌సీఐని ఆదేశించింది. పత్తి ఏ గ్రేడ్‌కు రూ.7020, బీ గ్రేడ్‌కు రూ.6620కి కొనాలని నిర్ణయించింది. ఈ ధరలు మాత్రం లాభదాయకంగా లేవని కర్షకులు వాపోతున్నారు. కేంద్రం […]

Karimnagar : పోలింగ్‌ బూత్‌ల పెంపు..

గంటల తరబడి ఓటింగ్‌ కోసం వరుసలో నిలబడే కష్టాలను తొలగించే దిశగా యంత్రాంగం శ్రమిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల దిశగా అవసరమైన ఏర్పాట్లలో అధికారులు తలమునకలవుతోంది.. ఇందులో అన్నింటికన్నా ముఖ్యంగా పోలింగ్‌ బూత్‌లపై అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. గత ఎన్నికల్లో ఒక్కో కేంద్రం వద్ద ఓటు వేసేందుకు పదుల సంఖ్యలో ఓటర్లు వరుసగా బారులు తీరి ఇక్కట్లను ఎదుర్కొన్న సందర్భాలను గుర్తించి.. ఈ సారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. […]

Tribal women : గిరిజన మహిళల ఆర్థిక స్వాతంత్య్రం…!

స్వశక్తితో తాము నిర్వహిస్తున్న పరిశ్రమను విస్తరించి మరికొంత మందికి ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారు ఏటూరునాగారం మండల కేంద్రంలో డ్రైమిక్స్‌ పరిశ్రమ నిర్వహిస్తున్న మహిళలు. మహిళల పొదుపు సంఘంలో సభ్యులుగా చేరిన తమను గ్రామైక్య సంఘం నుంచి జాయింట్‌ లయబిలిటీ గ్రూపు సభ్యులుగా ఎంపిక చేసి ఐటీడీఏ ఈ అవకాశాన్ని కల్పించిందని, మరో వంద మందికైనా తమ పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామంటున్నారు.

Vaddiraju RaviChandra : తెలంగాణాభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్‌

తెలంగాణాభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని రాజ్యసభ సభ్యులు, నియోజకవర్గ బాధ్యులు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. స్థానిక ఏవీఆర్‌ వేడుకల మందిరంలో శుక్రవారం భారాస మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరుతోందన్నారు. కాంగ్రెస్‌, భాజపా ఎన్నికలకు ముందు హామీలతో బురిడీలు కొట్టించి ప్రజలను మాయచేస్తారన్నారు. వారి ప్రలోభాలకు గురి కాకుడదన్నారు. ఎమ్మెల్యే హరిప్రియ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించి అవిరామంగా పాటుపడ్డారని […]

Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో వ్యర్థాల తొలగింపు ప్రక్రియ ప్రారంభం..

హుస్సేన్‌సాగర్‌లో వ్యర్థాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. ట్యాంక్‌ బండ్‌, ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను హెచ్‌ఎండీఏ అధికారులు తొలగిస్తున్నారు. మరోవైపు గణేష్ నిమజ్జనం ఇవాళ కూడా పీవీ మార్గ్‌లో కొనసాగుతోంది. క్రేన్ల సాయంతో వ్యర్థాలను, ఇనుప చువ్వలను తొలగిస్తూ ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. పూలు, సామగ్రి, ఇతర చెత్తా చెదారం, కాగితాలు సైతం జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది తొలగిస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు తొలగింపు ప్రక్రియ కొనసాగే అవకాశాలు ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ […]