Hyderabad: కొన్ని గంటల్లో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. అంతలోనే యువతి ఆత్మహత్య

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యాశ్రీ (23) గచ్చిబౌలిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. మార్చి 17న ఆమెకు వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. గురువారం ప్రీ వెడ్డింగ్‌ షూట్‌కు వెళ్లాల్సి ఉండగా.. […]

TSRTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆ సర్వీసుల్లో 10% డిస్కౌంట్‌

సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌: సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సుల్లో బెర్తులపై 10 శాతం రాయితీని ప్రకటించింది. ఈ సర్వీసులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుందని సంస్థ ఎండీ సజ్జనార్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. ఏప్రిల్‌ 30 వరకు డిస్కౌంట్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. లహరి ఏసీ స్లీపర్ […]

‘రైతు నేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్‌

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్‌ అను సంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తం. 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన. రూ.97 కోట్లతో ప్రాజెక్టు అమలే లక్ష్యంగా, మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటుకు రూ. 4.07 కోట్లు ప్రభుత్వం విడుదల […]

Telangana: గ్రూప్‌ 1, 2, 3 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో  గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ బుధవారం విడుదల అయ్యింది.  ఆగస్టు 7.8 తేదీల్లో గ్రూప్‌ 2 పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. అక్టోబర్‌ 21న గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. అదే విధంగా నవంబర్‌ 17, 18 తేదీల్లో గ్రూప్‌ 3 పరీక్ష నిర్వహించనున్నారు. 

Cong Vs BRS: రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నేతల ధర్నా.. 

హైదరాబాద్‌: తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు. LRS పథకాన్ని ఉచితం చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు నిరసనలు తెలుపుతున్నారు.  ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలు.. గతంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో గులాబీ పార్టీ నేతలు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే, హైదరాబాద్‌లోని […]

బీఆర్‌ఎస్‌కు కోనప్ప గుడ్‌బై..! సెక్రటేరియట్‌లో మంత్రి పొంగులేటితో భేటీ

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ నేత, సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బుధవారం ఉదయం తెలంగాణ సెక్రటేరియట్‌లో రాష్ట్ర రెవెన్యూ,సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చాంబర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న మీడియా ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు. కార్యకర్తలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రాబోయే పార్లమెంట్‌  ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌, బీఎస్పీ పొత్తుపెట్టుకుంటున్నట్లు మంగళవారం రెండు పార్టీల అధ్యక్షులు ప్రెస్‌మీట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. బీఎస్పీతో పొత్తు విషయంలో అసంతృప్తికి గురైన కోనప్ప బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. […]

Amit Shah Telangana Visit: తెలంగాణకు అమిత్‌షా.. భారీ సభకు బీజేపీ ప్లాన్‌

 ఢిల్లీ/హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రులు, బీజేపీ అగ్ర నేతలు తెలంగాణపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణలో​ పర్యటించనున్నారు. దీంతో, రాష్ట్రంలో రాజకీయంగా మరోసారి ఆసక్తికరంగా మారింది.  వివరాల ప్రకారం.. తెలంగాణలో మెజార్టీ లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ భారీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ తెలంగాణలో​ పర్యటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా తెలంగాణకు […]

బీజేపీ నేతలతో టచ్‌లో హరీష్‌రావు: కోమటిరెడ్డి వ్యాఖ్యలు

యాదాద్రి భువనగిరి: పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు బీజేపీ చేరుతారని జోస్యం చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ మేరకు హరీష్‌రావు బీజేపీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నాడని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.  కాగా, భువనగిరిలో మంత్రి కోమటిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్‌ఎస్‌లో ప్రతిపక్ష నాయకుడి హోదా కేసీఆర్‌ తన కొడుకు కేటీఆర్‌కు ఇస్తే అల్లుడు హరీష్‌ పార్టీ నుంచి బయటకు వెళ్తాడు.. అలాగే, అల్లుడికి ఇస్తే […]

KCR – హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య

భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దేవరకద్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా సాంకేతిక సమస్యను పైలట్‌ గుర్తించి అప్రమత్తమయ్యారు. వెంటనే హెలికాప్టర్‌ను తిరిగి వెనక్కి మళ్లించి ఎర్రవల్లిలోని కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో ల్యాండింగ్‌ చేశారు. మరోవైపు ఏవియేషన్‌ సంస్థ ప్రత్యామ్నాయ హెలికాప్టర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆ హెలికాప్టర్‌ రాగానే సీఎం పర్యటన యథావిథిగా కొనసాగనుంది.

Hanamkonda – కాంగ్రెస్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జంగా రాఘవరెడ్డి.

హనుమకొండ;తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితాను వెల్లడించినప్పటి నుంచి టిక్కెట్లు దక్కని పలువురు ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నాయకుడు జంగా రాఘవ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. రాయిఘవరెడ్డికి  కాంగ్రెస్ టికెట్ రాకవడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్య నేతలతో అత్యవసరంగా చర్చించిన అనంతరం ఆయన పార్టీ మారాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ టికెట్ దక్కని జంగా రాఘవరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రాఘవరెడ్డి భవిష్యత్ […]