‘మల్కాజిగిరి’కి మల్లారెడ్డి ఫ్యామిలీ దూరం!

ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి కాలేజీ కూల్చివేత నేపథ్యంలో మారిన రాజకీయ పరిణామాలు  సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి..  ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ ప్రచారం  దీంతో కేటీఆర్‌తో భేటీ అయిన మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి  పార్టీ మారబోమని వివరణ.. మల్కాజిగిరి నుంచి తమ కుటుంబ సభ్యులెవరమూ పోటీచేయబోమని వెల్లడి  హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. లోక్‌సభ అభ్యర్థులుగా పోటీలో ఉంటారనుకున్న నేతలు బరి నుంచి తప్పుకొంటుంటే.. మరోవైపు కొత్తవారి […]

కబ్జా భూములను సరెండర్‌ చెయ్‌

మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కబ్జా చేసిన ప్రభుత్వ, అసైన్డ్, చెరువు శిఖం భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే ఆయన ను కాంగ్రెస్‌లో చేర్చుకుంటామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌ శివార్లలోని కండ్ల కోయలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మామ మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి సహా మేడ్చల్‌ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రూ.25 వేలకోట్ల విలువ చేసే ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, చెరువు శిఖం భూములను ఆక్రమించారు. […]

చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలు: హరీష్ రావు..

సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మహబూబ్‎నగర్ వెనుకబాటు తనానికి కారణం నాటి టిడిపి, కాంగ్రెస్ పాలన అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలని, చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలుగా మారాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన […]

సీఎం హోదాలో తొలిసారిగా ఏపీకి రేవంత్‌.. కాంగ్రెస్ తరుఫున ప్రచారం

తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా విశాఖకు వెళ్లనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 11న విశాఖ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉండటంతో ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబుపై రేవంత్ ఏం మాట్లాడతారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా విశాఖకు వెళ్లనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 11న విశాఖ వేదికగా కాంగ్రెస్ […]

ప్రజాపాలనలో మహిళల భాగస్వామ్యం పెరిగింది: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: ప్రజా పాలనలో మహిళల ప్రాతినిథ్యం, భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. మహిళల సాధికారితతో పాటు ఆర్థిక స్వాలంబనకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, ఇంటింటికీ రూ.500 గ్యాస్ సిలిండర్ గ్యారంటీలను కొత్త ప్రభుత్వం అమల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన హక్కులు […]

ఎమ్మెల్యే మర్రి కళాశాల భవనం కూల్చివేత

దుండిగల్‌: మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌(ఐఏఆర్‌ఈ) కళాశాల భవనాన్ని కూల్చివేశారు. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారంటూ ఇటీవల నోటీసులు ఇచ్చిన ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు నడుమ కళాశాల వద్దకు చేరుకున్నారు. జేసీబీలతో ఐదు అంతస్తుల శాశ్వత భవనాన్ని కూల్చివేయడం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న కళాశాల విద్యార్థులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు. […]

ఎమ్మెల్సీలపై మళ్లీ నిర్ణయం

హైదరాబాద్‌: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలంటూ రాష్ట్ర కేబినెట్‌ చేసిన సిఫార్సు లపై గవర్నర్‌ వ్యవహరించిన తీరు సరికాదని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. సదరు సిఫార్సులను తిరస్క రిస్తూ 2023 సెప్టెంబర్‌ 19న గవర్నర్‌ ఇచ్చిన ఆదేశా లను రద్దు చేసింది. దీంతోపాటు గవర్నర్‌ ఆదేశాల మేరకు కోదండరామ్, ఆమెర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. మళ్లీ […]

850 ఎకరాల స్కాం.. చంద్రబాబుకు హైకోర్టు షాక్‌!

ఆ 850 ఎకరాల భూమి రద్దు సరైనదే.. చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పు పట్టిన తెలంగాణ హైకోర్టు వైఎస్సార్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉత్తర్వులు భూముల రద్దును సవాల్ చేస్తూ బిల్లీ రావు వేసిన పిటిషన్‌ కొట్టివేస్తూ తీర్పు హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో ఓ సం‍స్థకు అక్రమంగా కేటాయించిన 850 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి సుధీర్ఘ కాలం తర్వాత తీర్పు వచ్చింది. 2004లో నాటి ఆపద్ధర్మ చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. […]

రేవంత్‌ సర్కార్‌ను కూల్చం.. ఐదేళ్లు ఉండాల్సిందే!: కేటీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బయటి నుంచి ఎవరో కూల్చరని.. ప్రభుత్వాన్ని పడగొట్టేవాళ్లు ఆ పార్టీలోనే ఉన్నారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కరీంనగర్‌ పార్లమెంట్‌ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు బండి సంజయ్‌పైనా మండిపడ్డారు.  .. కరీంనగర్ నుంచే పార్లమెంట్ జంగ్ సైరన్ మోగబోతోంది. కేసీఆర్‌కు కరీంనగర్ అంటే సెంటిమెంట్. నాటి ఉద్యమ కాలాన సింహగర్జన సభకు కరీంనగరే వేదికైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనపై కూడా కదనభేరి సభ కరీంనగర్ […]

మేడారం జాతరకు రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే!

మేడారం మహాజాతర హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మేడారం జాతర ఆదాయం రూ.13,25,22,511 వచ్చింది. గతంలో కన్నా ఈసారి ఆదాయం పెరిగింది. వచ్చిన ఆదాయాన్ని డిపార్ట్​మెంట్​బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. జాతర అనంతరం హుండీలను టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకువచ్చి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కించారు. నాలుగురోజుల పాటు వైభవంగా సాగిన మేడారం జాతరకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చిన విషయం తెలిసిందే. ఆసియాలోనే అతిపెద్ద […]