Raghunandan rao: ‘‘ఈ నా గొంతుని కాపాడండి వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఈరోజు మోసపోయి మీరు ఆగం కావొద్దు’’

Telangana: గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బీజేపీకి ఓటు వేయాల్సింది ప్రజలను కోరుతున్నారు. సోమవారం దుబ్బాకలో రఘునందన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆయనకు మెదక్ జిల్లాకు సంబంధమేంటి అని ప్రశ్నించారు. కలెక్టర్‌గా ఉన్నటువంటి వ్యక్తి మాజీ సీఎం కాళ్లు మొక్కి వెంకటరామిరెడ్డి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని విమర్శించారు. సిద్దిపేట, […]

Telangana: Former MLA Shakeel’s son Rahel was arrested by the police : మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహేల్‎ను పోలీసులు అరెస్టు చేశారు.

పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఏడాది డిసెంబర్‎లో ప్రజా భవన్ ముందు ఉన్న భారీ కేట్లు ఢీ కొట్టిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహేల్‎ను పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది డిసెంబర్ 24న ఘటన జరిగిన తర్వాత దుబాయ్ పారిపోయాడు ఎమ్మెల్యే కొడుకు. అయితే అప్పటినుండి అతడి అరెస్టు కోసం పంజాగుట్ట పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. […]

TG change instead of TS for Telangana vehicles From Today : తెలంగాణ వాహనాలకు TS బదులు TG మార్పు

ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణను టీఎస్ బదులు టీజీగా మార్చాలని ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో కేంద్రానికి కూడా విన్నవించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్రం కూడా ఒకే చెప్పడంతో నేటి నుంచి రిజిస్ట్రేషన్ షురూ కానుంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణను టీఎస్ బదులు టీజీగా […]

TSRTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆ సర్వీసుల్లో 10% డిస్కౌంట్‌

సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌: సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సుల్లో బెర్తులపై 10 శాతం రాయితీని ప్రకటించింది. ఈ సర్వీసులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుందని సంస్థ ఎండీ సజ్జనార్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. ఏప్రిల్‌ 30 వరకు డిస్కౌంట్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. లహరి ఏసీ స్లీపర్ […]

Ramoji Film City – సందర్శన మనోహరంగా ఉంటుంది.

రామోజీ ఫిల్మ్ సిటీ,: దసరా, దీపావళి సెలవుల్లో సందర్శకులను రంజింపజేసేందుకు రామోజీ ఫిల్మ్ సిటీలో గురువారం వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఫిలింసిటీకి మొదటి రోజు సందర్శకులు పోటెత్తడంతో సందడి నెలకొంది. సందర్శకులు సుందరమైన ఫిల్మ్ సిటీ గార్డెన్స్ మరియు సినిమా చిత్రీకరించిన అద్భుతమైన ప్రదేశాల చుట్టూ తిరిగారు. ముఖ్యంగా రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అవకాశం ఉన్నందున మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల వెలుగుల్లో దెయ్యాల స్వర్గాన్ని తలపించే ఫిల్మ్ సిటీలో ఆబాలగోపాలం బిజీబిజీగా గడిపారు. […]